War 2 Box Office Collection Worldwide Till Now: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు సోమవారం 'వార్ 2' ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తమ సినిమా రూ. 300 కోట్ల క్లబ్బులో చేరిందని తెలిపింది. మూవీ కలెక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే ప్రజెంట్ వస్తున్న కలెక్షన్లు ఈ సినిమాకు సరిపోతాయా? గట్టెక్కుతుందా? అనేది ప్రశ్న. 

వీకెండ్ తర్వాత స్టడీగా 'వార్ 2'War 2 Box Office Collection Day 6 In India: ఇండియాలో 'వార్ 2' కలెక్షన్లు వీకెండ్ తర్వాత తగ్గాయి. ప్రతి సినిమాకు సాధారణంగా అది జరుగుతుంది. అయితే ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ నేపథ్యంలో మంగళవారం మరింత పడే ఛాన్స్ ఉందని కొందరు అంచనాలు వేశారు. అయితే వాటిని తల్లకిందులు చేస్తూ స్టడీగా కలెక్షన్స్ రాబట్టింది. 

ఇండియన్ బాక్స్ ఆఫీస్ బరిలో మంగళవారం 'వార్ 2' నెట్ కలెక్షన్స్ రూ. 8.25 కోట్లు. సోమవారంతో కంపేర్ చేస్తే కేవలం రూ. 50 లక్షలు మాత్రమే తక్కువ కలెక్ట్ చేసింది. ఇదేమంత డ్రాప్ కాదు. సోమవారం రూ. 12 కోట్లు కలెక్ట్ చేసిన 'కూలీ', ఆ తర్వాత రోజుకు రూ. 9.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అక్కడ డిఫరెన్స్ రూ. 2.50 కోట్లు ఉంది. కానీ 'వార్ 2'కి అలా కాదు. పెద్ద డిఫరెన్స్ లేదు. అయితే ఈ కలెక్షన్స్ సినిమాను గట్టెకించలేవని ట్రేడ్ టాక్.

Also Readఓటీటీలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు'... పవన్ సినిమాకు ప్రైమ్ వీడియో సపరేట్ సెన్సార్‌... ఇదెక్కడి ట్విస్ట్?

ఐదు రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంత?War 2 Worldwide Collection: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2' ఫైవ్ డేస్ గ్రాస్ కలెక్షన్ రూ. 58 కోట్లు. షేర్ విషయానికి వస్తే... రూ. 40 కోట్లు మాత్రమే. తెలుగు స్టేట్స్ రైట్స్ 90 కోట్లకు కొన్న నేపథ్యంలో హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ గట్టెక్కడానికి మరో 50 కోట్ల షేర్ అయినా రాబట్టాలి. వరల్డ్ వైడ్ గ్రాస్ చూస్తే... ఐదు రోజుల్లో 300 కోట్ల మార్క్ చేరుకుందని యష్ రాజ్ ఫిలిమ్స్ పేర్కొంది. కానీ అది 275 కోట్లు అని ట్రేడ్ పోర్టల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అక్కడ కూడా రికవరీ ఎటు 50 శాతం దాటలేదు. దాంతో డిజాస్టర్ దిశగా సినిమా అడుగులు పడుతున్నాయని బిజినెస్ టాక్. భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. 'బ్రహ్మాస్త్ర'తో భారీ విజయం అందుకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ, ఈ 'వార్ 2' మాత్రం ఇటు తెలుగు, అటు హిందీ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు.

Also Readపవన్ సినిమాలు చేయకుండా బ్యాన్ విధించండి... వీరమల్లు ప్రచారానికి ప్రభుత్వ నిధులా? - ఏపీ హైకోర్టులో మాజీ ఐఏఎస్ పిటీషన్