Vishwak Sen : హీరోలకు డైరెక్టర్స్ లైఫ్ ఇస్తారా? - మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రియాక్షన్ ఇదే...
Vishwak Sen Reaction : సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి తాను అస్సలు పట్టించుకోనని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అన్నారు. 'ఫంకీ' మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Vishwak Sen Reaction About Negative Comments Trollings : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా విశ్వక్ నెగిటివ్ ట్రోలింగ్స్, డైరెక్టర్స్, హీరోస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు
ఓ హీరోకి దర్శకుడి వల్లే లైఫ్ దొరికింది అంటూ కొంతమంది అంటుంటారని... ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదని అన్నారు విశ్వక్ సేన్. 'ఎవరైనా దర్శకుడు తన వల్లే ఓ హీరోకి లైఫ్ దొరికిందని చెప్తే అది చాలా తప్పు. అలా అనే వాళ్లను నేను సమర్థించను. ఉదాహరణకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చాలా సింపుల్‌గా ఉంటారు. పెళ్లి చూపులు దగ్గర నుంచి ఎంతో మంది కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేసినా ఒక్క శాతం గర్వం కూడా ఆయనలో చూడలేదు.
విజయ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, అభినవ్ ఇలా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం చేసినా కూడా తనకు సంబంధమే లేదన్నట్లు ప్రవర్తిస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నా కొత్త మూవీలో 150 కొత్త వారిని పరిచయం చేస్తున్నా. ఈ మూవీ గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా.' అని అన్నారు.
Also Read : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?
నెగిటివ్ ట్రోలింగ్స్‌పై...
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తాను ఒకేలా ప్రవర్తిస్తానని చెప్పారు విశ్వక్. 'సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అస్సలు పట్టించుకోను. ట్రోల్ చేసే వారికి నా సినిమాలే సమాధానం చెబుతాయని అనుకుంటున్నా. ఎప్పుడూ నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. ప్రజెంట్ ఇన్ స్టా గ్రామ్ ఒక్కటే వాడుతున్నా. లేడీ గెటప్‌లో నటించడం నా డ్రీమ్. లైలా మూవీతో అది నెరవేరింది. అయితే, ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.
మూవీ రిలీజ్ అయిన వెంటనే నాకు విషయం అర్థమైతే నా ఫ్యామిలీకి కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ఆ తర్వాత నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోయా. భవిష్యత్తులోనూ అలానే చేస్తా.' అంటూ చెప్పారు.
'ఫంకీ' ట్రైలర్ ఎప్పుడంటే?
'ఫంకీ' ట్రైలర్ ఈ నెల 7న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో మూవీ తెరకెక్కుతుండగా... నిర్మాత కుమార్తెగా కయాదు కనిపించనున్నారు. వీరితో పాటే నరేష్, రఘుబాబు, సంపత్ రాజ్, వీటీవీ గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
























