Funky Twitter Review - 'ఫంకీ' ట్విట్టర్ రివ్యూ: అమెరికా నుంచి బ్యాడ్ టాక్... విశ్వక్ సేన్ సినిమా బాలేదా? ప్రీమియర్ రిపోర్ట్ చూడండి
Funky Review Telugu: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కేవీ అనుదీప్ దర్శకత్వం వహించిన సినిమా 'ఫంకీ'. అమెరికాలో ప్రీమియర్ షోస్ నుంచి సినిమాకు వచ్చిన రిపోర్ట్ ఏమిటో తెలుసుకోండి

Funky Movie Telugu Review: అమెరికాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటించిన 'ఫంకీ' ప్రీమియర్లు పడ్డాయి. ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి ఎలాంటి రిపోర్ట్ వచ్చింది? ఎన్నారై ఆడియన్స్ ఏం అంటున్నారు? సోషల్ మీడియాలో టాకేంటి? అనేది తెలుసుకోండి.
ఇండస్ట్రీపై అనుదీప్ పంచ్ పేలిందా!?
అసలు 'ఫంకీ' సినిమాలో కథ ఏముంది?
'ఫంకీ' ట్రైలర్ చూస్తే... కథ ఏమిటనేది క్లారిటీ వస్తుంది. దర్శకుడు కావాలని కలలు కనే యువకుడిగా విశ్వక్ సేన్ కనిపిస్తారు. నిర్మాత కుమార్తెగా హీరోయిన్ కయాదు లోహర్ నటించారు. దర్శకుడిగా విశ్వక్ సేన్‌కు అవకాశం ఇస్తుంది కయాదు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ ఎలా మొదలైంది? ఏమిటి? అనేది సినిమా.
స్టార్టింగ్ టు ఎండింగ్ కేవీ అనుదీప్ స్టైల్‌లో 'ఫంకీ' సాగిందని ఎన్నారై ఆడియన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్. అయితే సినిమా ఇండస్ట్రీ మీద అనుదీప్ వేసిన పంచ్ డైలాగ్స్ సరిగా ఆశించిన రీతిలో పేలలేదట. కొన్ని జోక్స్ బావున్నాయని... అయితే మెజారిటీ జోక్స్ మరీ సిల్లీగా ఉన్నాయని ఎన్నారై ఆడియన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్. క్రిస్పీ ఎడిటింగ్ వల్ల కామెడీ సన్నివేశాలు, జోక్స్ మధ్య గ్యాప్ లేకుండా పోయిందని... బ్యాక్ టు బ్యాక్ జోక్స్ రావడం వల్ల ఆర్గానిక్ ఫ్లో అనేది లేదని టాక్.
#Funky A silly, over the top comedy where a few jokes land, but the rest is a complete dud!
— Venky Reviews (@venkyreviews) February 13, 2026
The film is in the typical Anudeep style comedy zone, banking heavily on one-liners. The jokes work only in a few places, but the rest feels completely silly and gets irritating. The bad…
#Funky Below Par 1st Half!
— Venky Reviews (@venkyreviews) February 13, 2026
Typical Anudeep style one-liner comedy. A few jokes work, but most fall flat and feel overly silly. Choppy editing makes the narration feel like a compilation of comedy scenes without an organic flow.
Kaadu Bhayya Editing ayinaka 1st half chuskunnara @VishwakSenActor #AnudeepKV
— Hitesh Adusumalli - #AbolishCasteSystem (@hitesh_cinema) February 13, 2026
Manchi comedy One liners kooda Aagam aithunnayi. Oka structure ledu asalu Very Sloppy Editing#Funky #FunkyReview
Decent 1st half. Most of the comedy lands 👍 #Funky https://t.co/LKgbDD1ZXr
— RGK 🍀 (@iamrgk_) February 13, 2026
'జాతి రత్నాలు' తరహాలో 'ఫంకీ' కూడా మాస్ కామెడీ మూవీ అని, ఎన్నారై ఆడియన్స్ కంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు నచ్చే సినిమా అని విశ్వక్ సేన్ ఫ్యాన్స్ చెబుతున్న మాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. సినిమాకు అమెరికా నుంచి టాక్ అటు ఇటు రావడంతో 'జాతి రత్నాలు' విజయం కావడానికి కారణం అనుదీప్ కాదని, నవీన్ పోలిశెట్టికి క్రెడిట్ ఇవ్వాలని కొంత మంది కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.
Polishetty deserves major credit for Jathiratnalu. Not worth a trip to the theater for sure. Oddly enough there aren't many laughs in 1st half. Less than Sankranthi movies for sure. #Funky
— Aikido (@Kamal_Tweetz) February 13, 2026
హ్యాండ్సమ్ లుక్‌లో హీరో విశ్వక్ సేన్...
బబ్లీగా గ్లామర్ డాల్ కయాదు లోహర్!
విశ్వక్ సేన్ నటనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎటువంటి క్యారెక్టర్, ఎలాంటి ఎమోషన్ అయినా సరే క్యారీ చేయగలడు. అటువంటి హీరోకి లాస్ట్ రెండు సినిమాలు కాస్త గట్టిగా డిజప్పాయింట్ చేశాయి. అయితే 'ఫంకీ'లో మాత్రం అతను డిజప్పాయింట్ చేయలేదని అమెరికా ప్రీమియర్స్ నుంచి వచ్చిన రిపోర్ట్. అన్నిటి కంటే ముఖ్యంగా హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారట. లాస్ట్ సినిమాల్లో కాస్త బొద్దుగా ఉన్న విశ్వక్, ఈ సినిమా కోసం సన్నబడ్డాడు. హీరోయిన్ కయాదు లోహర్ బబ్లీగా నటించిందని, ఆమె గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుందని టాక్. భీమ్స్ అందించిన మ్యూజిక్ మాస్ పల్స్ కు తగ్గట్టు ఉందట.























