Cult Movie Teaser : బ్లడ్ బాత్‌లా విశ్వక్ 'కల్ట్' టీజర్ - స్క్విడ్ గేమ్‌ను గుర్తు చేసే వయలెన్స్
Cult Teaser Review : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పార్టీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో 'కల్ట్' మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు.

Vishwak Sen's Cult Movie Teaser Review : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'కల్ట్'. కొత్త నటీనటులతో ఈ మూవీని తెరకెక్కిస్తుండగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
బ్లడ్ బాత్‌లా 'కల్ట్' టీజర్
'కల్ట్' టీజర్ చూస్తే స్క్విడ్ గేమ్ గుర్తొస్తుంది. బ్లడ్ బాత్‌లా వయలెన్స్ పీక్స్‌లో టీజర్‌లో చూపించారు. ముగ్గురు యువకులు ఎంజాయ్ చేయాలని గోవాకు వెళ్తారు. అయితే, పబ్‌లోకి వెళ్లేందుకు వారికి ఎంట్రీ దొరకదు. అలా పార్టీ కోసం 'కల్ట్' అనే పబ్‌కు వెళ్తారు. అక్కడ యూత్ అంతా పార్టీ మూడ్‌లో ఉండగా స్క్రీన్‌పై ఓ బొమ్మ ప్రత్యక్షం అవుతుంది. 'లెట్స్ స్టార్ట్ ది గేమ్' అనగానే అందరూ ఎంజాయ్మెంట్‌లోకి వెళ్తారు. అయితే, ఈ గేమ్‌లో ఓడిన వారు ఎలిమినేట్ కావడం అంటే ప్రాణాలు పోవడమే.
'పారిపోవద్దు ఆడుకుందాం రండి' అంటూ ఆ బొమ్మ చెప్పగానే ఒక్కొక్కరి తలలు తెగిపడుతుంటాయి. అసలు ఆ పబ్‌లో ఏం జరుగుతోంది? విశ్వక్ సేన్ ఎంటరై ఎందుకు అందరినీ చంపుతుంటాడు? అసలు ఈ కల్ట్ స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. టీజర్ చూస్తుంటే డేంజరస్ స్క్విడ్ గేమ్ అందరికీ గుర్తొస్తుంది. వయలెన్స్ మరీ ఎక్కువగా వీడియోలో చూపించారు.
Also Read : డైరెక్ట్‌గా ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ 'ఎక్యూజ్డ్' - లెస్బియన్ కాన్సెప్ట్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తూనే కీలకపాత్రలో నటించాడు. కరాటే రాజు, సందీప్ కాకరాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో 'కల్ట్' రిలీజ్ కానుంది. త్వరలోనే ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
























