డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ 'కన్నప్ప'. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రీకాళహస్తిలో ఘనంగా ఏర్పాటు చేయబోతున్నారు అని, దీనికి ప్రభాస్ తో సహా ఇందులో నటిస్తున్న స్టార్స్ అందరూ గెస్టులుగా హాజరు కాబోతున్నారని సమాచారం. 


శ్రీకాళహస్తిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ 


'కన్నప్ప' మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సినిమాలోని నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన 'శివ శివ శంకర' పాట, టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. అలాగే తాజాగా ఈ మూవీ నుంచి చిత్ర బృందం 'సగమై చెరి సగమై' అంటూ సాగే ఒక లవ్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసి, బ్యూటిఫుల్ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి బిగ్ ఈవెంట్స్ పెట్టలేదు మేకర్స్. అప్పుడప్పుడు మంచు విష్ణు విషయం ఇచ్చే ఇంటర్వ్యూలు, సినిమా నుంచి అప్డేట్స్ తప్ప డైరెక్ట్ ఈవెంట్స్ ఏమీ జరగలేదు. అందుకే ఒకేసారి 'కన్నప్ప' టీం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి భారీ ఎత్తున వేడుకను ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ శ్రీకాళహస్తిలో జరగనుండగా, సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్న నటీనటులు అందరూ... ప్రభాస్ తో పాటు, మిగతా నటీనటులు కూడా భాగం కాబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. 


'కన్నప్ప' మేకింగ్ వీడియో రిలీజ్ 


మరోవైపు మేకర్స్ వరుసగా ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయగా, తాజాగా 'కన్నప్ప' మేకింగ్ వీడియోను వదిలారు. ఆ వీడియోలో సినిమా కోసం చిత్రం బృందం ఎంత కష్టపడింది? ఎంత హార్డ్ వర్క్ చేశారు? అనే విషయాలను విష్ణు వివరించారు. దర్శకుడితో కలిసి 24 క్రాఫ్ట్స్ తో తాను ఎలా సమన్వయం చేసుకున్నారో స్పష్టంగా చెప్పుకొచ్చారు. 


ఇదిలా ఉండగా 'కన్నప్ప'లో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి అగ్రతారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా ఆకట్టుకోబోతున్నారు. ఈ క్రమంలోనే 'కన్నప్ప' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, డేట్ వంటి వివరాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.


Also Read'గుండమ్మ కథ'లో కార్తీక దీపం మోనిత... ఫుల్ ఫ్యాషన్ గురూ - అదిదా ట్విస్ట్!