Vishnu Anger About Sree Vishnu '#Single' Trailer: యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ '#సింగిల్' (#Single) ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. శ్రీవిష్ణు (Sree Vishnu), వెన్నెల కిశోర్ (Vennela Kishore) కామెటీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ట్రైలర్‌లో నవ్వులు పూయించారు. అయితే, కామెడీ ట్రాక్‌లో సాగే కొన్ని డైలాగ్స్ ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీశాయి.
విష్ణు ఆగ్రహం
'సింగిల్' ట్రైలర్‌పై మంచు విష్ణు (Manchu Vishnu) ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో.. శ్రీవిష్ణు 'శివయ్యా..' అని అరుస్తూ ఉండడంపై విష్ణు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ ఫస్ట్ టీజర్‌లోనూ ఆయన 'శివయ్యా..' అని గట్టిగా అరుస్తారు. దీనిపై అప్పట్లో ట్రోలింగ్ కూడా నడిచింది. ఇప్పుడు '#సింగిల్' ట్రైలర్‌లోనూ శ్రీ విష్ణు 'శివయ్యా' అంటూ వెటకారం చేసేలా అరవడంపై విష్ణు కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే, ట్రైలర్ చివర్లో 'మంచు కురిసిపోతుందని' అంటూ శ్రీవిష్ణు డైలాగ్ చెప్పడంపై కూడా విష్ణు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై డైరెక్టర్స్ అసోసియేషన్‌లోనూ కంప్లైంట్ చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి విష్ణు దీనిపై బహిరంగంగా స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.
మీడియా ప్రశ్నకు విష్ణు ఆన్సర్
హిట్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు డిఫరెంట్ జానర్లలో మూవీస్ చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఆయన 'శ్వాగ్' మూవీ తర్వాత '#సింగిల్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'శ్వాగ్' మూవీలోని ఓ పాటలో బూతులు ఎక్కువగా ఉన్నాయని ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. అయితే, అవి సంస్కృత పదాలు అంటూ దర్శకుడు వివరణ ఇస్తే తప్ప ఎవరికీ అర్థం కాలేదు.
'#సింగిల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు శ్రీవిష్ణు సమాధానం ఇచ్చారు. మూవీస్‌ల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు.. కొన్ని సంస్కృత పదాలని.. మీకు అర్థం కాకపోతే ఇప్పుడు క్లాసులు తీసుకుని అర్థం చేసుకునేలా చెప్పలేను కదా.. అంటూ ఆన్సర్ చెప్పారు. తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అస్సలు ఉండవు అని స్పష్టం చేశారు.
ఈ సినిమాకు 'నిను వీడని నీడను నేనే' ఫేం కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. కేతిక శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.