తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుడు జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆయన విజయంపై చిత్రసీమ సంతోషం వ్యక్తం చేసింది. నిన్న మొన్నటి వరకు అభినందించలేదని విమర్శలు ఎదుర్కొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం విజయ్‌ విజయంపై తనకు ఎటువంటి అసూయ లేదని స్పష్టత ఇచ్చారు. కోలీవుడ్ హ్యాపీ అనుకుంటున్నా తరుణంలో యువ కథానాయకుడు విశాల్ (Vishal) 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాంబు పేల్చారు. విజయ్ క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు? విశాల్ ఏమన్నారు? వంటి విషయాల్లోకి వెళితే...

సినిమాటోగ్రఫీ మంత్రి ఎంపికపై విశాల్ నిరాశముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Vijay) నేతృత్వంలోని క్యాబినెట్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం సంతోషమే అయినప్పటికీ... సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి రాజ్‌ మోహన్‌ (Minister Rajmohan)కు కేటాయించడం తనను నిరాశకు గురి చేసిందని విశాల్ ట్వీట్ చేశారు. సినిమా రంగానికి సంబంధించిన సమస్యలపై అవగాహన లేని వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించడం వల్ల చిత్రసీమ ఇబ్బందులు పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు విశాల్.

Also ReadKamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

చిత్రసీమ సమస్యలపై విజయ్ చొరవ తీసుకోవాలివిశాల్ ట్వీట్ చూస్తే... చిత్రసీమ సమస్యలను విజయ్‌కు వివరించడం సులువు అని, కొత్త మంత్రికి చెప్పడం కష్టం అనేది అర్థం అవుతోంది. ''మూడు దశాబ్దాలుగా విజయ్ చిత్రసీమలో ఉన్నారు. పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ఆయన. సీఎం విజయ్ కంటే చిత్రసీమకు కొత్త వ్యక్తి అయిన మంత్రికి మా సమస్యలు ఎలా వివరించాలో అర్థం కావడం లేదు'' అని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:Ravi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

ప్రస్తుతం చిత్రసీమ, మరీ ముఖ్యంగా నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ తరుణంలో సీఎం విజయ్ స్వయంగా చొరవ తీసుకుని ఇండస్ట్రీకి మేలు చేసే చర్యలు తీసుకోవాలని విశాల్ రిక్వెస్ట్ చేశారు. తొమ్మిదేళ్లుగా నిర్మాతలు - తమిళ చిత్రసీమ అడుగుతున్న మూడు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని సీఎం విజయ్‌కు విజ్ఞప్తి చేశారు.

చిత్రసీమ కోసం విశాల్ చేసిన డిమాండ్లు ఇవే!

  • థియేటర్లలో టికెట్ అమ్మకాల కోసం తమిళనాడు ప్రభుత్వం స్వయంగా ఆన్‌లైన్ టికెట్ విండోను తీసుకు రావాలని విశాల్ కోరారు. అలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ఒక్కో టికెట్‌పై ప్రేక్షకులకు 30 రూపాయల అదనపు ఛార్జీల భారం పడదని, వాళ్లకు పెద్ద ఉపశమనం లభిస్తుందని చెప్పారు.
  • దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధించాలనే నిబంధన అమలులో ఉందని... కానీ మన దేశంలో సినిమా టికెట్లపై జీఎస్టీతో పాటు లోకల్ బాడీ టాక్స్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే అని, ఆ అదనపు పన్నును తక్షణమే రద్దు చేయాలని విశాల్ కోరారు.
  • అదే విధంగా ప్రస్తుతం చిన్న సినిమాలకు తమిళనాడు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చాలా తక్కువగా ఉందని, చిన్న చిత్రాల మనుగడ కోసం ఆ సబ్సిడీ మొత్తాన్ని ఎక్కువగా పెంచాలని విశాల్ విజ్ఞప్తి చేశారు.

సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులైన రాజ్‌ మోహన్‌ను తాను తక్కువగా చేసి మాట్లాడటం లేదని... చిత్రసీమకు చెందిన వ్యక్తిగా తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశానని విశాల్ స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రతిపాదనలు నెరవేరడం లేదు కనుక వ్యక్తిగతంగా కాకుండా బహిరంగంగా చెప్పినట్టు పేర్కొన్నారు. సీఎం విజయ్ కచ్చితంగా చిత్రసీమకు పరిశ్రమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు విశాల్ తెలిపారు.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్