తెలుగు రాష్ట్రాల్లో ‘విరూపాక్ష’ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రేక్షకుల రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. 


సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ‘విరూపాక్ష’ మూవీ ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘విరూపాక్ష’ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. సాయి ధరమ్ తేజ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆరంభం అదిరిందంటూ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇతర సెలబ్రిటీల నుంచి కూడా మాంచి రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ వల్ల కలెక్షన్లు కూడా బాగున్నాయి. రెండు రోజుల్లో రూ.10.58 కోట్ల వరకు వసూళ్లు సాధించింది ఈ మూవీ. 


దర్శకుడి ఫోన్ మాయం


ప్రేక్షకుల రెస్పాన్స్‌ను స్వయంగా చూద్దామని దర్శకుడు కార్తీక్ వర్మ దండు శుక్రవారం నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ కలిసి హైదరాబాద్‌లోని పలు థియేటర్లు చుట్టేశారు. ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూసి దర్శకనిర్మాతలిద్దరూ చాలా సంబరపడ్డారు. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గుర్తుతెలియని వ్యక్తి థియేటర్‌లో కార్తీక్ ఫోన్ కొట్టేశాడు. నిర్మాత పర్శు కూడా పోయిందని తెలిసింది. ఆ దీంతో కార్తీక్, ప్రసాద్ తలపట్టుకున్నారు. మరి, ఆ ఫోన్ దొరికిందా లేదా అనేది మాత్రం తెలియాలేదు. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. వీరిద్దరు ఐమాక్స్ థియేటర్‌తోపాటు సంధ్య, శ్రీరాములు థియేటర్లకు వెళ్లారు. దీంతో ఫోను, పర్శులు ఎక్కడ పోయాయనేది తెలియరాలేదు. 


మేనల్లుడికి చిరు, పవన్ అభినందనలు!


మేనల్లుడి తాజా సినిమా సక్సెస్ కావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ సాయి ధరమ్ తేజ్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్పింది. ‘విరూపాక్ష’కు పాజిటివ్ టాక్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రంతో ఆయన మళ్లీ హిట్ ట్రాక్ లో వెళ్లడం ఆనందంగా ఉందని తెలిపింది.  “’విరూపాక్ష’ గురించి చక్కటి రిపోర్టులు వస్తున్నాయి. నేను వాటిని చూసి చాలా సంతోషంగా ఉన్నాను. సాయి ధరమ్ తేజ్ మంచి సక్సెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చావు. మీ చిత్రాన్ని అందరూ అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నీ సినిమాని ప్రేక్షకులు మెచ్చుకోవడంతో పాటు వారి ఆశీస్సులు అందించడం హ్యాపీ ఉంది.  మీ మొత్తం టీమ్ కు హృదయ పూర్వక అభినందనలు” అని చిరంజీవి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ‘విరూపాక్ష’ సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘డియర్ సాయి ధరమ్ తేజ్, ‘విరూపాక్ష’ గ్రాండ్ సక్సెస్ పట్ల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ అభినందన లేఖ పంపించారు. 


Also Read సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?