Vijay Deverakonda and Rashmika Open Up About Wedding: విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాను ఇకపై లవ్ బర్డ్స్ అని పిలవకూడదు. ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే ఇన్ని రోజులూ తమ బంధం గురించి ఇద్దరూ మౌనం వహించారు. ఎవరెన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగినా పెదవి విప్పలేదు. ఫైనల్లీ, పెళ్లికి నాలుగు రోజుల ముందు ఇద్దరూ సోషల్ మీడియాలో సేమ్ పోస్ట్ చేశారు. పెళ్లి గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

మా కంటే ముందు మీరున్నారు!విజయ్ దేవరకొండ, రష్మిక... ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ పోస్ట్ చేశారు. ''మేం ఏదైనా ప్లాన్ చేసే ముందు, మా కోసం మేం ఎంపిక చేసుకునే ముందు... మా కంటే ముందు మీరు (అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశిస్తూ...) ఉన్నారు. మీరు ఎంతో ప్రేమతో మాకు ఒక పేరు ఇచ్చారు... 'విరోష్' అని. ఇవాళ మనస్ఫూర్తిగా మిమ్మల్ని గౌరవిస్తూ... మేం జంటగా మీ ముందుకు వస్తున్నాం. 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding Of Virosh) అని పేరు పెట్టాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్స్'' అని విజయ్, రష్మిక పేర్కొన్నారు.

Also Read: Chiranjeevi: చిరంజీవి హిట్ సినిమా... ఓసారి ర‌జ‌నీ, మ‌రోసారి ధ‌నుష్‌ - రెండు తమిళ్ రీమేక్స్ ఏవో తెలుసా?

జనవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి!Vijay Deverakonda Rashmika Wedding Date: ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో పెళ్లి జరుగుతోంది. మార్చి 4వ తేదీన హైదరాబాద్ సిటీలో రిసెప్షన్ ఇస్తున్నారు. పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరు కానున్నారు. రిసెప్షన్ కి మాత్రం తెలుగు చిత్రసీమ ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు హాజరు అయ్యే అవకాశం ఉంది.

Also Read Bookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?