Vikram’s Thangalaan postponed the release date again : ఈ ఏడాది టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల విడుదల తేదీలు పలుమార్లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతుండడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాట అగ్ర హీరోల సినిమాలకు వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ 'తంగాలాన్' రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ కానున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది.


సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న'తంగలాన్'


'తంగలాన్' మూవీని మొదట రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయాలని అనుకుకొని రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల సినిమాని సమ్మర్ కి అంటే ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక తాజా సమాచారం ప్రకారం సమ్మర్ కి కూడా 'తంగలాన్' రిలీజ్ అయ్యే అవకాశం లేదట. ఇదే విషయాన్ని నిర్మాత కన్ఫామ్ చేస్తూ ఎలక్షన్స్ తర్వాతే 'తంగలాన్' సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దాని ప్రకారం సమ్మర్ రేస్ నుంచి విక్రమ్ 'తంగలాన్' సినిమా తప్పుకున్నట్లే అనే విషయం స్పష్టం అవుతుంది. త్వరలోనే మూవీ టీం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మరో కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది 



'తంగలాన్' లో డైలాగ్స్ ఉండవు- విక్రమ్


'తంగలాన్' సినిమా గురించి విక్రమ్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన జీవితంలోనే ఎక్కువ కష్టపడ్డ సినిమా ఇదే అని అన్నారు." ఈ సినిమాలో నాకు డైలాగ్స్ ఉండవు. డబ్బింగ్ లేదు. 'శివ పుత్రుడు' మాదిరిగా కేవలం అరుపులే ఉంటాయి. ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా, ఎమోషనల్ గా ఉంటుంది. ఇందులో సినిమా గ్లామర్ అస్సలు లేదు. పూర్తి డిఫరెంట్ మూవీ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. రోజంతా రెస్ట్ ఉండేది కాదు. పొద్దున్నుంచి సాయంత్ర వరకు షూటింగ్ చేస్తూనే ఉండేవాళ్లం. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు నేను చేయలేదు. గిరిజనులు ఎలా జీవిస్తారో ఈ సినిమాలో అలాగే చేశాం. ఈ సినిమా తర్వాత దర్శకుడు రంజిత్ మరో లెవల్ కు వెళ్తాడని భావిస్తున్నా. ఈ సినిమా కోసం పని చేసిన అందరీ మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చాడు.


'తంగలాన్' కోసం 35 కేజీల బరువు తగ్గిన విక్రమ్


'తంగలాన్' నిర్మాత జ్ఞానవేల్ ఈ సినిమా కోసం  విక్రమ్ పడిన శ్రమను గుర్తు చేస్తూ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా 35 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. సినిమా షూటింగ్ అనుకున్న దానికన్నా మూడు నెలల తర్వాత మొదలైంది. ఆ సమయంలో ఈ మూవీలో తన గెటప్ కు సరిపడేలా విక్రమ్ బరువు తగ్గారు. వెయిట్ తగ్గించుకునేందుకు రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడ్డాడు. సినిమా షూటింగ్ మొదలైన 65వ రోజు నేను లొకేషన్ కు వెళ్లాను. అంతకు ముందు 64 రోజుల్లో జరిగిన అన్ని విషయాలు విక్రమ్ నాతో చెప్పారు. విక్రమ్ మిగతా ఆర్టిస్టుల మాదిరి కాకుండా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని సిన్సియర్ గా చేస్తారు. ఈ సినిమాలో సరికొత్త విక్రమ్ ను చూస్తారు" అంటూ తెలిపారు.


కోలార్ గోల్డ్ ఫైల్స్ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. 'కబాలి', 'సార్పట్టా' వంటి సినిమాలను తెరకెక్కించిన పా. రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పార్వతి తిరువోతూ, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పశుపతి, డానియల్, హరికృష్ణన్, అన్బుదురై ఇతర కీలక పాత్రలు పోషించారు.


Also Read : దసరా బరిలో అక్కినేని హీరో - 'దేవర' కి పోటీగా 'తండేల్'?