Ramayana Movie : 'రామాయణ'లో కోలీవుడ్ స్టార్? - గ్రేట్ మైథలాజికల్ స్టోరీలో ఆ రోల్‌కు ఓకే చెప్తారా?
Vijay Sethupathi : అవెయిటెండ్ మైథలాజిక్ ఎపిక్ 'రామాయణ' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టులో కీలక రోల్ కోసం కోలీవుడ్ స్టార్‌ను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

Vijay Sethupathi To Join Cast Of Nitesh Tiwari Ramayana Movie : బాలీవుడ్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేట్ ఎపిక్ 'రామాయణ'. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది.
ఆ పాత్రలో కోలీవుడ్ స్టార్
ఈ మూవీలో రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తుండగా... ఆయన తమ్ముడు విభీషణుడి పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదిస్తున్నారట. ఈ పాత్రకు ఆయనైతేనే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇంతటి భారీ ప్రాజెక్టులో ఆయన భాగం అవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : సంక్రాంతి తమిళ హిట్ - కార్తీ, శ్రీలీల మూవీస్‌ను మించిన బ్లాక్ బస్టర్... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఏయే రోల్స్‌లో ఏయే స్టార్స్?
- శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్
- సీతా దేవిగా సాయి పల్లవి
- రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్
- రావణుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్
- లక్ష్మణుడిగా టీవీ నటుడు రవి దూబే
- రాముడికి నమ్మిన బంటు హనుమంతుడిగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్
- రాముని తల్లి, దశరథుని భార్య కౌశల్యగా ప్రముఖ నటి ఇందిరా కృష్ణ
- 'రామాయణ' ఇతిహాసానికి కీలక ట్విస్ట్ రోల్ కైకేయిగా లారా దత్తా
- కైకేయి సేవకురాలు మందర పాత్రలో 'షిబా చద్దా రాణి'
- రావణుని సోదరి సీతాపహరణకు కారణమైన శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్
- శూర్పణఖ భర్త 'విద్యుత్జిహ్వ'గా వివేక్ ఒబెరాయ్ నటించనున్నారు.
భారీ బడ్జెట్
ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మైథలాజికల్ వండర్‌ను క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రెండు పార్టులుగా మూవీ నిర్మిస్తుండగా... ఈ ప్రాజెక్టుతోనే యశ్ నిర్మాతగా మారుతున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ భారీ ప్రాజెక్టుకు దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ పాడ్ కాస్ట్‌లో తెలిపారు. తక్కువ ఖర్చుతోనే పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన... కొన్ని హాలీవుడ్ సినిమాల కంటే ఇది తక్కువ బడ్జెటే అని అన్నారు. ఈ మూవీ మనీ కోసం చేస్తుంది కాదని... మన రాముడి గురించి ప్రపంచానికి చెప్పాలని అనుకుంటున్నట్లు చెప్పారు. హాలీవుడ్ రేంజ్‌లో మూవీ తెరకెక్కుతుండగా దాదాపు 20 భాషల్లో సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్‌ను ఈ ఏడాది దీపావళికి, వచ్చే ఏడాది దీపావళికి రెండో పార్ట్ రిలీజ్ చేయనున్నారు.























