కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవల కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సెలబ్రిటీలు అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా ఉంటుందన్న విషయాన్ని తాజాగా ఆయన ఓ ఈవెంట్ ద్వారా నిరూపించారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ పాన్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే మంచిదని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. 


కేంద్రానికి విజయ్ సేతుపతి రిక్వెస్ట్


కేంద్ర ప్రభుత్వానికి విజయ్ సేతుపతి చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఆర్థిక లావాదేవీల్లో కీలకపాత్ర పోషిస్తున్న పాన్ కార్డు నెంబర్ కి సంబంధించి కొన్ని మార్పులు చేయాలని ఆయన ఇటీవల ఓ ఈవెంట్లో కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడమే దానికి కారణం. ఈవెంట్ లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ "పాన్ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఉన్నాయి. దీనివల్ల ఆ రెండు భాషలు రాని వాళ్ళు పాన్ కార్డు అప్డేట్ల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలు పాన్ కార్డ్ విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే భాష అర్థంకాక గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి వారికి అర్థమయ్యే భాషలో అప్డేట్స్ ఉంటే అసలు ఈ సమస్య ఉండదు. కాబట్టి పాన్ కార్డు వెబ్సైట్లో తమిళంలో కూడా సమాచారం అందుబాటులో ఉంటే చాలామందికి చేరువవుతుంది" అని చెప్పుకొచ్చారు. 


ఒక్క మాటలో చెప్పాలంటే పాన్ కార్డ్, దానికి సంబంధించిన అప్డేట్లను బహుళ భాషల్లో అందుబాటులో ఉండేలా చూడాలని విజయ్ సేతుపతి ఈవెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంటే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారికి అవసరమైన ఆర్థిక సమాచారం సులభంగా అర్థమయ్యేలా ఉండాలని ఆయన కోరారు. మరి విజయ్ సేతుపతి రిక్వెస్ట్ ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా అనేది చూడాలి. అయితే ఓ స్టార్ హీరో ఇలా తమ మాతృభాష కోసం వాయిస్ రైజ్ చేయడం అనేది నిజంగా సాహసమే. ఇప్పటిదాకా ఒక్కసారి హీరో కూడా ఇలా తమ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెరపైకి తీసుకొచ్చే సాహసం చేయలేదు. ఇక టాలీవుడ్ లో ఎవరైనా ఇలా తెలుగులో కూడా సమాచారం అందించాలని డిమాండ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు నెటిజన్లు. 


Also Read: 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?


విజయ్ సేతుపతి అప్ కమింగ్ సినిమాలు 


విజయ్ సేతుపతి కోలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు వాళ్లకు కూడా సుపరిచితులే. ఆయనకు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. గత ఏడాది రిలీజ్ అయిన విజయ్ సేతుపతి 50వ సినిమా 'మహారాజా' ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. అయితే ఆ మూవీ తర్వాత 'విడుదల 2' అనే మూవీతో మరోసారి ఆయన తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో పలకరించారు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంజు వారియర్ కీ రోల్ పోషించింది. అయితే ఫస్ట్ ఫార్ట్ కంటే సెకండ్ పార్ట్ అంతగా బాలేదని టాక్ నడిచింది. విజయ్ సేతుపతి ఇంకా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయలేదు.


Also Readస్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?