Vijay Sethupathi - Malavika Mohanan: అప్పుడు విలన్... ఇప్పుడు హీరో - విజయ్ సేతుపతితో మాళవిక ట్రిపుల్ ధమాకా
Vijay Sethupathi New Movie: విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. మాళవిక గత సినిమాల్లో విలన్‌గా నటించిన విజయ్‌సేతుపతి ఈసారి హీరోగా కనిపించబోతున్నాడు.

కోలీవుడ్ వెర్సటైల్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో 'సూపర్ డీలక్స్' ఒకటి. ఆ సినిమాలో ట్రాన్స్ జెండర్ పాత్రలో అసమాన నటనకుగాను నేషనల్ అవార్డును దక్కించుకున్నారు విజయ్ సేతుపతి. 'సూపర్ డీలక్స్' మూవీకి త్యాగరాజ కుమార్‌రాజా దర్శకత్వం వహించాడు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత సూపర్ డీలక్స్ దర్శకుడితో విజయ్ సేతుపతి మరో సినిమా చేయబోతున్నాడు.
సూపర్ డీలక్స్ దర్శకుడితో 'పాకెట్ నావెల్'
Pocket Novel Movie Update: 'పాకెట్ నావెల్' సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ మూవీకి పాకెట్ నావెల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
Vijay Sethupathi In Pocket Novel: విజయ్ సేతుపతి ముఖంతో పాటు అగాథంలోకి ఓ వ్యక్తి పడిపోతున్నట్లుగా డిఫరెంట్‌గా ఈ ఫస్ట్‌లుక్‌ను డిజైన్ చేయడం ఆసక్తిని పంచుతోంది.
View this post on Instagram
విజయ్ సేతుపతితో మాళవిక మోహనన్ హ్యాట్రిక్!
Malavika Mohanan and Vijay Sethupathi movie: 'పాకెట్ నావెల్' సినిమాలో విజయ్ సేతుపతితో పాటు 'ది రాజా సాబ్' ఫేమ్ మాళవికా మోహనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నది. విజయ్ సేతుపతితో మాళవికా మోహనన్ చేస్తోన్న మూడో సినిమా ఇది. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట', దళపతి విజయ్ 'మాస్టర్'లో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించగా... ఆ రెండు సినిమాల్లో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించింది.
విజయ్ సేతుపతి & మాళవికా మోహనన్ ఇంతకు ముందు చేసిన సినిమాల్లో వాళ్ళు హీరోయిన్ & విలన్. కానీ, 'పాకెట్ నావెల్'లో మాత్రం వీరిద్దరు హీరో హీరోయిన్లుగా కనిపించబోతుండటం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. విజయ్ సేతుపతితో పాటు మాళవికా మోహనన్ క్యారెక్టర్లు ఛాలెంజింగ్‌గా సాగుతాయని సమాచారం. ఓ రైటర్ జీవితం నేపథ్యంలో పాకెట్ నావెల్ సాగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram
'పాకెట్ నావెల్' షూటింగ్ మొదలైంది
'పాకెట్ నావెల్' మూవీలో కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రాజ్ బీ శెట్టి మరో ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం నుంచి మొదలు పెట్టినట్లు విజయ్ సేతుపతి ప్రకటించాడు.
దర్శకుడు త్యాగరాజ కుమార్ రాజా 2011లో రిలీజైన 'అరణ్య కాండం' మూవీతో డైరెక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పదిహేనేళ్ల కెరీర్‌లో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. కాగా... ఇటీవలే 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా మోహనన్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం కార్తీ 'సర్దార్ 2'లో హీరోయిన్‌గా నటిస్తోంది మాళవికా మోహనన్.























