Rajinikanth: రజనీకాంత్‌పై విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్... తలైవాది డబుల్ స్టాండర్డ్స్ ఆ?
Trolls On Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ మీద దళపతి విజయ్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. తలైవాది డబుల్ స్టాండర్డ్ అంటున్నారు. ఎందుకంటే?

ప్రస్తుతం తమిళనాడు ఎలాంటి వాతావరణం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి పీఠానికి అడుగు దూరంలో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఆగిపోవడం, మెజార్టీ పూర్తి స్థాయిలో రాకపోవడంతో సీఎం పీఠం ఎక్కేది ఎవరు? ఏ గ్రూపు ఏ పార్టీతో ఉంటుందో? ఎవరెవరు జంప్ అవుతారు? అసలు చివరకు సీఎం ఎవరు అవుతారు? అనే గందరగోళం నెలకొంది. ఎక్కువ సీట్లు గెలిచి పెద్ద పార్టీగా విజయ్ టీవీకే అతరించిన సంగతి తెలిసిందే. 108 స్థానాల్లో గెలిచి విజయ్ అదరగొట్టేశాడు. అయితే మ్యాజిక్ ఫిగర్ మాత్రం 118 అన్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ ఏ అడుగు వేస్తాడు? ఏ నిర్ణయం తీసుకుంటాడు? అని అంతా అనుకున్నారు.
రజనీకాంత్ మద్దతు ఎవరికి?
విజయ్ గురించి ఎందుకు మాటల్లేవ్?
తమిళనాడులో విజయ్ కు మద్దతుగా పలువురు హీరోలు గళం విప్పుతున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ కూడా మాట్లాడారు. ఆయన స్టాలిన్ డీఎంకే పార్టీలో ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ ని గవర్నర్ ఆహ్వానించాలని చెప్పారు. అయితే రజనీకాంత్ మాత్రం మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే స్టాలిన్ దగ్గరకు వెళ్లారు. స్టాలిన్ - రజనీకాంత్ భేటీ కీలకంగా మారింది. దీంతో బీజేపి ఆట ఆడుతోందని, రజనీని మధ్య వర్తిత్వం కోసం వాడుతోందని దారుణంగా ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు.
డీఎంకే, అన్నా డీఎంకేని కలిపే బాధ్యత రజనీకి ఇచ్చి ఉంటారని, కామన్ అభ్యర్థిగా రజనీకాంత్‌ను అనుకుంటున్నారని ఇలా రకరకాలుగా రూమర్లు బయటకు వచ్చాయి. దీంతో రజనీకాంత్‌ను విజయ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు. అసలు కౌటింగ్ రోజునే రజనీకాంత్ సోషల్ మీడియా ఏకిపారేసింది.
రజనీ యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా విమర్శించారు. అసలు ధైర్యం చేసి అడుగు ముందుకు వేసి ఉంటే... రజనీ అప్పుడే సీఎం అయ్యే వారు అంటూ కౌంటర్లు వేశారు. విజయ్ విజయాన్ని చూసి రజనీ ఓర్వలేకపోతోన్నారు అంటూ రకరకాల మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు స్టాలిన్, రజనీ భేటీతో ఆ ట్రోలింగ్ మరింతగా పెరిగింది. అయితే స్టాలిన్ మాత్రం డీఎంకే, అన్నా డీఎంకే కలయిక మీద వచ్చిన రూమర్లను ఖండించారు.
విజయ్‌ని తమిళనాడు గవర్నర్ కూడా ముప్పు తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. మెజార్టీ లేదు.. సంఖ్యా బలం చూపించు.. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇస్తానని అడ్డంగా నిలబడటం, చివరకు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకో అని అవకాశం ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇక మున్ముందు తమిళ నాట ఎలాంటి చదరంగం జరుగుతుందో చూడాలి. ఇప్పటికీ రజనీకాంత్ పెదవి విప్పలేదని విజయ్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















