Vijay's Jana Nayagan Gets A Certificate From CBFC : కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్'కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ వివాదాలతో రిలీజ్ ఆగిపోయింది. తాజాగా గురువారం సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇస్తూ A సర్టిఫికెట్ జారీ చేసింది.
రన్ టైం ఎంతంటే?
గురువారం ఉదయం నుంచీ సోషల్ మీడియాలో జన నాయగన్ సెన్సార్ సర్టిఫికెట్, రిలీజ్ డేట్ గురించి ప్రచారం సాగుతూనే ఉంది. మొత్తానికి దానిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఫైనల్‌గా విజయ్ చివరి సినిమాకు A సర్టిఫికెట్ ఇస్తూ... 3 గంటల 3 నిమిషాల (183 నిమిషాలు) రన్ టైం ఫిక్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇటీవల సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందన్న ప్రచారాన్ని ఖండించిన మేకర్స్... బోర్డు సూచనల మేరకు కొన్ని కట్స్ చేసి మళ్లీ రివ్యూకు పంపుతామని చెప్పారు. ఇంతలోనే CBFC నుంచి సర్టిఫికెట్ వచ్చేసింది.
Also Read : Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
రిలీజ్ ఎప్పుడు?
ఇప్పటివరకూ సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులు, పైరసీ ఇష్యూస్‌తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న 'జన నాయగన్' రిలీజ్‌కు మార్గం సుగమం కావడంతో దళపతి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక మేకర్స్ రిలీజ్‌పై ఫోకస్ చేశారు. జులై 24న తమిళం, తెలుగు సహా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ప్రేమలు ఫేమ్ మమితా బైజు కీలకపాత్ర పోషించారు. వీరితో పాటే ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు మాస్, యాక్షన్ అంశాలను టచ్ చేస్తూ యాక్షన్ ఎంటర్టైనర్‌గా మూవీని రూపొందించారు.
