Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ - పడి లేచిన కెరటంలా రణబాలి
Ranabaali Special Video : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నుంచి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. విజయ్ గుర్రపు స్వారీ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Vijay Deverakonda's Ranabaali Special Horse Riding Video : రౌడీ బాయ్, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
పడి లేచిన కెరటం
ఈ మూవీలో వారియర్‌గా కనిపించనున్నారు విజయ్. దీని కోసం గుర్రపు స్వారీ సైతం నేర్చుకున్నారు. ఆయన గుర్రాన్ని మచ్చిక చేసుకుని దానిపై స్వారీ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గుర్రపు స్వారీ చేస్తుండగా... కింద పడి గాయాలైనా పడి లేచిన కెరటంలా ఓ పవర్ ఫుల్ వారియర్‌గా ఆయన తిరిగి రైడింగ్ చేయడం ఆకట్టుకుంటోంది. 'మా స్టాలియన్ విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ మూవీ టీం ఈ వీడియోను పంచుకుంది.
దీన్ని చూసిన విజయ్ అభిమానులు కింద పడి గాయాలనై పట్టుదలతో గుర్రపు స్వారీ నేర్చుకున్నారని... వాట్ ఏ డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటే బర్త్ డే విషెష్ కూడా చెబుతున్నారు.
Also Read : బాలయ్య, కొరటాల మూవీ - ఎవరూ ఊహించని టైటిల్!... గాడ్ ఆఫ్ మాసెస్ ట్రెండ్ వైరల్
ఈ మూవీలో విజయ్ దేవరకొండ రణబాలిగా నటిస్తుండగా... ఆయన సరసన జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' మూవీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. రణబాలి నుంచి రిలీజ్ చేసిన వీరిద్దరి పెళ్లి వీడియో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన రణబాలిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
Also Read : క్షుద్రపూజలు బెడిసి కొడితే వెన్నులో వణుకే! - ఓటీటీలో ట్రెండింగ్ హారర్ థ్రిల్లర్... డోంట్ మిస్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















