Virosh Wedding Venue : వెడ్డింగ్ ఆఫ్ విరోష్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి జరిగేది ఇక్కడే... స్పెషాలిటీస్, కాస్ట్ ఎంతో తెలుసా?
Vijay Deverakonda Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఈ నెల 26న ఉదయపూర్‌లోని 'ఐటీసీ మెమెంటోస్' రిసార్ట్‌లో జరగనుంది. ఆ రిసార్ట్ ప్రత్యేకలేంటో ఓసారి చూస్తే...

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Venue At ITC Mementos Udaipur : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం రాజస్థాన్ ఉదయపూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ జంట ఉదయపూర్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరగనుంది.
పెళ్లి ఎక్కడంటే?
విరోష్ పెళ్లి వేడుక ఈ నెల 26న ఉదయపూర్‌లోని 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ఏకాయా' (ITC Mementos) రిసార్ట్‌లో వైభవంగా జరగనుంది. ఇప్పటికే పెళ్లి వేదిక సుందరంగా ముస్తాబైంది. ఉదయపూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి నడుమ ప్రశాంత వాతావరణంలో వివాహ వేడుక ఘనంగా జరగనుంది. సెలబ్రిటీల వెడ్డింగ్స్‌కు ఈ లగ్జరీ హోటల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
ప్రస్తుతం 'ఐటీసీ మెమెంటోస్' ట్రెండ్ అవుతుండగా నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 117 విల్లాలు ఉన్నాయి. ప్రతీ విల్లా నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి, అందమైన కొండలు, బ్యూటిఫుల్ నేచర్ కనువిందు చేస్తుంది. అందుకే మ్యాగ్జిమమ్ సెలబ్రిటీలంతా ఇదే లగ్జరీ హోటల్‌ను ప్రిఫర్ చేస్తుంటారు. విజయ్, రష్మికల పెళ్లి జరుగుతుండడంతో ఈ రిసార్ట్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ వరకూ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. ఈ రిసార్ట్‌లో రకాన్ని బట్టి రోజుకు కాస్ట్ ఫిక్స్ చేస్తారు.
View this post on Instagram
View this post on Instagram
విల్లాస్ - వాటి కాస్ట్
ఈ రిసార్ట్‌లో వ్యాలీ వ్యూ విల్లా, లేక్ వ్యూ విల్లా, ప్రీమియం విల్లా, అరవల్లీ సూట్, మెమెంటోస్ సూట్, ప్రెసిడెన్షియల్, గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్స్ కూడా ఉంటాయి.
వ్యాలీ వ్యూ విల్లా - రూ. 28,399 - రూ. 28,666
లేక్ వ్యూ విల్లా - రూ. 30,799 - రూ. 31,088
ప్రీమియం విల్లా - రూ. 34,799 - రూ. 35,126
ఆరావళి సూట్ - రూ. 57,199 - రూ. 71,499
మెమెంటోస్ సూట్ - రూ. 73,199 - రూ. 91,499
దీంతో పాటే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ప్రెసిడెన్షియల్ సూట్స్‌కు ఒక రోజు కాస్ట్‌ను స్పెషల్ రిక్వెస్ట్ మేరకు వెల్లడిస్తారు.
View this post on Instagram
అతిథులకు రాచ మర్యాదలు
ఈ రిసార్ట్‌కు వచ్చే అతిథులకు రాచ మర్యాదలు చేస్తారు. అద్భుతమైన విందు భోజనాలు వడ్డిస్తారు. ఉదయ్ పెవిలియన్, కబాబ్స్ & కుర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి రెస్టారెంట్లలో సాంప్రదాయ భారతీయ రుచులతో పాటు ప్రపంచ ప్రసిద్ధి వంటకాలను రెడీ చేసి అతిథులకు వడ్డిస్తారు. దీంతో పాటే ఫిట్నెస్ సెంటర్, జిమ్ వంటి వాటిని కూడా ఆస్వాదించవచ్చు.
రష్మిక, విజయ్ పెళ్లి జరిగేది ఇక్కడే #vijaydevarakonda #rashmikamandanna #vijayrashmika #virosh #destinationwedding #theweddingofvirosh pic.twitter.com/8jTU1moumZ
— ABP Desam (@ABPDesam) February 23, 2026
























