Vijay Deverakonda Rashmika: విజయ్ దేవరకొండ చేతికి రింగ్ - రష్మిక మరో పోస్ట్ వైరల్...
Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేతికి రింగ్ ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

Vijay Deverakonda's Ring Photos Gone Viral: గత 4 రోజులుగా టాలీవుడ్ బెస్ట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇద్దరూ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయనప్పటికీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఎంగేజ్మెంట్ వార్తలు హల్చల్ చేస్తున్న వేళ ఓ వైపు రష్మిక తన సినిమాల గురించి వరుస పోస్టులు పెడుతున్నారు. అటు, విజయ్ చేతికి ఓ రింగ్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పుట్టపర్తిలో విజయ్
విజయ్ దేవరకొండ ఆదివారం పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. ప్రశాంతి నిలయం వద్ద ట్రస్ట్ వర్గాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సమయంలో మీడియా ప్రతినిధులు కొందరు ఫోటోలు తీయగా... అందులో ఆయన చేతికి రింగ్ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అది ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రష్మికతో నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తల తర్వాత ఫస్ట్ టైం ఆయన బయటకు వచ్చారు.
గతంలో విజయ్ వేలికి రింగ్ లేదని... అది కచ్చితంగా ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. మరి దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే, గతంలో రష్మిక వేలికి కూడా ఉంగరం ఉన్నట్లు ఫోటోలు వైరల్ అది ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె చేతికి ఉంగరం లేకపోవడంతో ఆ రూమర్లకు చెక్ పడింది.
Also Read: అనసూయ 'అరి' ట్రైలర్ వచ్చేసింది - డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉంటుందంటే?
అనుకోకుండా తీసుకున్న నిర్ణయం
మరోవైపు ఎంగేజ్మెంట్ వార్తలు, రష్మిక మూవీస్ రిలీజ్‌కు రెడీగా ఉండడంతో ఆమె పేరు కూడా ట్రెండ్ అవుతోంది. ఇదే టైంలో ఆమె వరుస పోస్టులు చేస్తున్నారు. అయితే, అవి సినిమాల గురించి కావడం ఎగ్జైట్మెంట్‌కు గురి చేస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ రిలీజ్ డేట్ గురించి పోస్ట్ చేశారు. ఇక తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. లేటెస్ట్ పోస్టులో బాలీవుడ్ మూవీ 'థామా'లో సాంగ్ గురించి వివరించారు.
రీసెంట్‌గా 'నువ్వు నా సొంతమా' అనే పాట రిలీజ్ కాగా... రష్మిక తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాట వెనుక ఆసక్తికర విషయాన్ని ఆమె వెల్లడించారు. 'మేము దాదాపు 12 రోజులు అద్భుతమైన ప్లేస్‌లో షూటింగ్ చేశాం. చివరి రోజు మా దర్శక నిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఇంత మంచిగా ఉన్న ప్లేస్‌లో ఓ సాంగ్ ఎందుకు చేయకూడదు? అంటూ ఆలోచించగా అది అందరికీ నచ్చి... 3 - 4 రోజుల్లోనే రిహార్సల్స్ చేసి పాటను షూట్ చేశాం. సాంగ్ పూర్తయ్యాక అందరం ఆశ్చర్యపోయాం. మీరంతా కూడా థియేటర్లలో ఈ పాట ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ' అంటూ ఆ పాటలో స్టిల్స్ షేర్ చేశారు.
View this post on Instagram





















