Vijay Deverakonda: అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే... రష్మికతో సందడి
Vijay Deverakonda Birthday Celebrations: విజయ్ దేవరకొండ 37వ పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో జరిగాయి. తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి ఆయన సందడి చేశారు.

- విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో కేక్ కట్ చేశారు.
- ఇది పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ మొదటి పుట్టినరోజు వేడుక.
- ఆయనతో పాటు భార్య రష్మిక మందన్న కూడా సందడి చేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అభిమానులు కొందరు ఆయన్ను ముద్దుగా 'రౌడీ బాయ్' అంటారు. ఇవాళ (మే 9వ తేదీన) రౌడీ బాయ్ బర్త్ డే. అభిమానుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు విజయ్ దేవరకొండ అభిమానులకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే... వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేశారు. అంతే కాదు... తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి సందడి చేశారు.
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ మొదటి పుట్టినరోజు
ఈ ఏడాది (2027) పుట్టినరోజు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda Birthday)కు మరింత ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే... పెళ్లి తర్వాత ఆయన మొదటి పుట్టినరోజు ఇది.
పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులతో విజయ్ దేవరకొండ నేరుగా ముచ్చటించారు. వాళ్ళను కలిశారు. ముఖాముఖి మాట్లాడి... వాళ్ళతో కలిసి కేక్ కటింగ్ సెలబ్రేషన్లలో పాల్గొన్నారు. పుట్టినరోజు కావడంతో విజయ్ దేవరకొండ నివాసం వెలుపల శనివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. తన కోసం వచ్చిన అభిమానులు డిజప్పాయింట్ కాకుండా బాల్కనీ నుంచి అందరికీ అభివాదం చేశారు. అప్పుడు ఆయనతో పాటు రష్మిక కూడా ఉన్నారు. ఆమె సంతోషం నవ్వులో కనిపించింది.
Also Read: Roopa Ganguly - మూడుసార్లు సూసైడ్ అటెంప్ట్... పదమూడేళ్ళ చిన్నోడితో సహ జీవనం
View this post on Instagram
అభిమానులతో కలిసి విజయ్ దేవరకొండ కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరెంజ్ రంగు టీ షర్ట్‌లో ఉన్నారు. మరికొన్ని వీడియోలలో బ్రౌన్ కలర్ టీ షర్ట్‌లో అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు.
View this post on Instagram
అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు, యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. విజయ్ - రష్మిక పెళ్లిలో ఇప్పటి వరకు ఎవరూ చూడని ఫోటోలను షేర్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే... శౌర్యువ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఇవాళ 'రణబాలి' టీం స్పెషల్ బర్త్ డే విషెష్ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన గుర్రపుస్వారీ నేర్చుకుంటూ కనిపించారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో రష్మిక హీరోయిన్. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో నటిస్తున్న 'రౌడీ జనార్ధన' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Also Read: Rashmika Marriage - 'సు ఫ్రమ్ సో' దర్శకుడితో రష్మిక పెళ్లి... ఫోటోలు వైరల్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















