Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. ఆదివారం పుట్టపర్తి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Vijay Deverakonda Car Accident: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా... జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో హీరో విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది. బొలెరో కారు అకస్మాత్తుగా టర్న్ తీసుకుంటూ వెనుక నుంచి వస్తోన్న విజయ్ కారును ఢీకొట్టింది.
ప్రమాదం తర్వాత విజయ్ స్నేహితుడి కారులో అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆదివారం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లిన విజయ్... సోమవారం ఉదయం సమాధిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఫీల్డ్‌లోకి 'ఛాంపియన్' ఎంట్రీ - రోషన్ న్యూ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?





















