Vijay Antony : బిచ్చగాడు కాంబోలో 'వంద దేవుళ్లు' - మూవీ ఎలా ఉంటుందంటే?
Bookie Movie : ఎవరినీ హర్ట్ చేయకూడదనే ఉద్దేశంతోనే 'పూకి' టైటిల్‌ను 'బూకి'గా మార్చేసినట్లు హీరో విజయ్ ఆంటోని తెలిపారు. తన నెక్స్స్ మూవీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Vijay Antony About Bookie Movie : కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' మూవీతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన సినిమాలో తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ మూవీ 'బూకీ' కూడా తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ నెల 20న తెలుగులో రిలీజ్ కానుంది. గణేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో అజయ్ ధీషన్, ధనుషా హీరో హీరోయిన్లుగా నటించారు. సునీల్, మంచు లక్ష్మి కీలకపాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని ఓ కీ రోల్ ప్లే చేయడం సహా నిర్మాతగా, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విజయ్ ఆంటోని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
'అందుకే టైటిల్ మార్చేశాం'
ఈ మూవీకి ముందుగా 'పూకి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో అనౌన్స్‌మెంట్ టైంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. తమిళంలో ఉండే టైటిల్‌ను అలాగే తెలుగులోనూ ఫిక్స్ చేయడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగింది. తెలుగులో బూతు పదాన్ని మూవీ టైటిల్‌గా పెట్టడం ఏంటి? అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేశారు. దీంతో టైటిల్ వెంటనే 'బూకి'గా మార్చేశారు.
తాజాగా దీనిపై విజయ్ ఆంటోని రియాక్ట్ అయ్యారు. 'తమిళంలో ఉండే టైటిల్‌నే ఈ మూవీకి కూడా పెట్టాం. అయితే, ఎవరినీ హర్ట్ చేయకూడదనే ఉద్దేశంతోనే టైటిల్ మార్చేశాం. ' అంటూ చెప్పారు.
'పాట పాడే ఛాన్స్ రాలేదు'
ఈ మూవీలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషించగా... తనకు పాట పాడే ఛాన్స్ ఇవ్వలేదంటూ నవ్వులు పూయించారు మంచు లక్ష్మి. 'బూకి మూవీ యూనివర్సల్ స్టోరీ. కొరియన్‌లో చూసినా అర్థమవుతుంది. నా ఇన్ స్టా రీల్స్ చూసి సైకియాట్రిస్ట్ రోల్‌కు సెలక్ట్ చేశారని నాకు తెలిసింది. దీంతో రీల్స్‌లో మరింత యాక్టివ్ అయ్యా.' అంటూ చెప్పారు.
Also Read : హీరో సుహాస్‌కు ఘోర అవమానం - ఆ హీరోయిన్ పక్కన అతను ఎందుకు అన్నారు?... కట్ చేస్తే...
'వంద దేవుళ్లు' ఎలా ఉంటుందంటే?
'బిచ్చగాడు'లో టైటిల్ సాంగ్ 'వంద దేవుళ్లే కలిసొచ్చినా...' పాట ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ మూవీలో పాటనే టైటిల్‌గా విజయ్ ఆంటోని నెక్స్ట్ మూవీ వంద దేవుళ్లు (నూరు సామి) తెరకెక్కుతోంది. 'బిచ్చగాడు'కు దర్శకత్వం వహించిన శశినే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఈ మూవీ బిచ్చగాడుని మించి ఉంటుంది. మదర్ సెంటిమెంట్‌తోనే రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాం. వచ్చే వారం నుంచి వంద దేవుళ్లు మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి.' అంటూ చెప్పారు. 'బిచ్చగాడు' కాంబో మళ్లీ రిపీట్ అవుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
























