సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలను నటీనటులు ఎంత సీక్రెట్‌గా దాచిపెడదామని చూసినా.. అవి ఏదో ఒక విధంగా బయటికి వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత కూడా నటీనటులు తమ ప్రేమ విషయాలను ఓపెన్‌గా ఒప్పుకోరు. ఫ్రెండ్స్ అంటూ మాట దాటేస్తుంటారు. విజయ్ దేవరకొండ, రష్మిక విషయంలో కూడా చాలాసార్లు ఇదే జరిగింది. విజయ్, రష్మిక ఎప్పుడూ సన్నిహితంగా ఉంటారు. కలిసి బయట కనిపిస్తారు. విజయ్ కుటుంబంతో రష్మిక చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఇన్ని జరిగినా కూడా మేమిద్దరం ఫ్రెండ్స్ అనే అంటుంటారు విజయ్, రష్మిక. తాజాగా మరోసారి వీరిద్దరు లవ్ బర్డ్స్ అని, అంతే కాకుండా లివిన్‌లో ఉంటున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనికి కారణం వీరు విడివిడిగా పోస్ట్ చేసిన ఫోటోలే.
‘గీతా గోవిందం’తో మొదలు..
విజయ్ దేవరకొండ, రష్మిక ముందుగా ‘గీతా గోవిందం’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనికి ముఖ్య కారణం వీరిద్దరి మధ్య కెమిస్ట్రీనే. ఈ మూవీలో వీరి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత విజయ్, రష్మిక కలిసి ‘డియర్ కామ్రేడ్’లో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ మరీ ఎక్కువగా సరదాగా కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ కాదని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు విజయ్‌కు, రష్మికకు.. వీరి ప్రేమ వ్యవహారం గురించి విడివిడిగా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కూడా మేము కేవలం ఫ్రెండ్స్ అని చెప్పేవారు. తాజాగా విజయ్, రష్మిక విడివిడిగా పోస్ట్ చేసిన ఫోటోలో ఒకే బ్యాక్‌గ్రౌండ్ ఉండడంతో వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.
బ్యాక్‌గ్రౌండే సాక్ష్యం..
రష్మిక.. కేవలం విజయ్‌తో మాత్రమే కాదు.. తన పూర్తి ఫ్యామిలీతో కూడా చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఓసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా వీరిద్దరు కలిసి చేసుకున్నారు అనడానికి సాక్ష్యంగా వీరిద్దరు పోస్ట్ చేసిన ఫోటోల్లో ఒకే రకమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత కూడా విజయ్, రష్మిక కలిసి సైలెంట్‌గా వెకేషన్స్‌కు వెళ్లి వచ్చేవారు. అక్కడ కూడా ఒకే బ్యాక్‌గ్రౌండ్ వల్లే వీరు దొరికిపోయేవారు. ఇలా ఒకే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోలను విడివిడిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. విజయ్, రష్మిక దొరికిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోల్లో మాత్రం విజయ్ ఒక గార్డెన్‌లో కూర్చున్నాడు. రష్మిక కూడా అదే గార్డెన్‌లో నిలబడి ఫోటో దిగిన ఫొటో పోస్ట్ చేసింది. అయితే ఇది విజయ్ ఇల్లు అయినా అయ్యిండాలి లేదా విజయ్, రష్మిక కలిసి ఒకే ఇంట్లో కలిసి అయిన ఉండుండాలి అని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి.
ఇద్దరూ బిజీబిజీ..
ప్రస్తుతం విజయ్, రష్మిక.. ఎవరి సినిమాల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉండగా.. రష్మిక చేతిలో కూడా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలాకాలం భారీ ఫ్లాపుల్లో ఉన్న తర్వాత ‘ఖుషి’ హిట్.. విజయ్‌ను కాస్త ఊపిరిపీల్చుకునేలా చేసింది. మూవీ రిలీజ్ అయినా కూడా ఇంకా ‘ఖుషి’ ప్రమోషన్స్‌లోనే బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో.. త్వరలోనే తన తరువాతి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. రష్మిక కూడా ‘పుష్ప 2’, ‘యానిమల్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉంది.
Also Read: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో #BoycottJawan - కారణం అదేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial