Venkatesh 78th Movie: మళ్ళీ ఇరువురి భామల కౌగిలిలో వెంకటేష్... అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాలో హీరోయిన్లు ఎవరంటే?
Venkatesh Anil Ravipudi New Movie: 'మన శంకర వరప్రసాద్ గారు'తో సంక్రాంతికి విజయం అందుకున్న అనిల్ రావిపూడి... వచ్చే సంక్రాంతికి వెంకటేష్ సినిమాతో రానున్నారు. అందులో హీరోయిన్లు ఎవరంటే?

సంక్రాంతి సక్సెస్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేయడానికి హిట్ మిషన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'తో ఈ ఏడాది (2026) సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. వచ్చే ఏడాది (2027) విక్టరీ వెంకటేష్ సినిమాతో రానున్నారు. అందులో హీరోయిన్లను ఫైనలైజ్ చేశారని తెలిసింది.
వెంకటేష్ సరసన బుట్ట బొమ్మ, మహానటి!
Venkatesh Pairs Up with Pooja Hegde and Keerthy Suresh in His 78th Movie - Venky 78: ప్రస్తుతం మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 78' (ఏకే 47')లో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయ్యాక అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
View this post on Instagram
వెంకటేష్‌కు త్రివిక్రమ్ సినిమా 77వది అయితే... అనిల్ రావిపూడిది 78వది. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు చోటు ఉందని తెలిసింది. అందులో వెంకీకి జంటగా ఇద్దరు ఉంటారట. ఆయన సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే, మహానటి కీర్తీ సురేష్ నటించనున్నారని తెలిసింది. ఇంతకు ముందు 'ఎఫ్ 2'లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారట. వెంకటేష్, అనిల్ రావిపూడి లాస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు.
View this post on Instagram
ఫహాద్ ఫాజిల్ జంటగా ఆషికా రంగనాథ్!
వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ సైతం నటించనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయ్. అది నిజమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
View this post on Instagram
అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ తమ్ముడిగా ఫహాద్ ఫాజిల్ కనిపిస్తారని టాక్. ఆయనకు జంటగా ఆషికా రంగనాథ్ (Ashika Ranganath Pairs Up With Fahadh Faasil In Venky 78)ను ఎంపిక చేశారట. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్', కింగ్ అక్కినేని నాగార్జున 'నా సామి రంగ', మాస్ మహారాజా రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాల్లో ఆషిక నటించారు. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఆమె సెకండ్ మెయిన్ లీడ్. త్వరలో వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేయనున్నారని సమాచారం.























