'మగధీర'లోని ఓ పాటలో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. తర్వాత 'బ్రూస్ లీ'లోని క్లైమాక్స్ సీన్ చేశారు. తనయుడు రామ్ చరణ్ సినిమాల్లో తండ్రి చిరంజీవి కనిపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150'లో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. 'ఆచార్య'లో కలిసి నటించారు. 'ఓజీ'లోని 'ఫైర్ స్ట్రోమ్' లిరికల్ వీడియో విడుదలైనప్పుడు అందులో ఉన్నది అకిరా నందన్ అని ప్రచారం జరిగింది. తండ్రీ తనయులు కలిసి తెరపై కనిపిస్తే ప్రేక్షకులలో ఆ సినిమాపై ఉండే క్రేజ్ వేరు. అభిమానులకు వచ్చే కిక్ వేరు. ఇప్పుడు 'బరి'కి ఆ క్రేజ్, ఆ కిక్ రానుంది. 

Continues below advertisement

'బరి'లో మెగా బ్రదర్ నాగబాబు కూడా!మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రారంభమైన పాన్ ఇండియా ఫిల్మ్ 'బరి'. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. వాలీబాల్ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఇందులో వరుణ్ తేజ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు (Nagababu Konidela) కీలక పాత్రలో కనిపించనున్నారు. 

'కొరియన్ కనకరాజు' విడుదల (ఆగస్టు 7న థియేట్రికల్ రిలీజ్) నేపథ్యంలో ఎన్నారై అభిమానులతో వరుణ్ తేజ్ ముచ్చటించారు. జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఆ సమయంలో 'బరి'లో నాగబాబు నటిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ సినిమాల్లో నాగబాబు కనిపించలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి దుర్గా తేజ్, అల్లు శిరీష్ సినిమాల్లో నటించారు. తనయుడితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

Continues below advertisement

Also ReadKorean Kanakaraju First Review - కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ హారర్ కామెడీ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

'బరి' సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా చెల్లెలు నిహారికా కొణిదెల తన పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ సంస్థపై నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. తండ్రీ కొడుకులు నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.

Also ReadAnchor Charmilla Latest Photos - చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు

'కమిటీ కుర్రోళ్ళు'తో యదువంశీని దర్శకుడిగా పరిచయం చేశారు నిహారిక. 'బరి'ని కూడా అతని దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. సంక్రాంతికి సినిమాను థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. అయితే వరుణ్ తేజ్ కాలికి గాయం కావడం వల్ల చిత్రీకరణ ఆలస్యం కానుంది. సినిమా కూడా సంక్రాంతికి కాకుండా తర్వాత రానుంది.

Also Read: Bigg Boss 10 Telugu - 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి