మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి షురూ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు ఇంట్లో అతి త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు అయ్యింది. 


అవును... లావణ్యా త్రిపాఠితో!
తెలుగు తెర 'అందాల రాక్షసి' లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi)తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారనేది కొత్త వార్త ఏమీ కాదు. చిత్రసీమ ప్రముఖులకు, ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే... ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని వాళ్ళిద్దరూ చెప్పింది లేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. 


జూన్ 9న వరుణ్, లావణ్య నిశ్చితార్థం!
Varun Tej Lavanya Tripathi Engagement : జూన్ 9న... అనగా ఈ శుక్రవారం వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ హాజరు కానున్నారు. కొన్ని రోజుల క్రితమే వాళ్ళకు ఎంగేజ్మెంట్ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షూటింగ్స్, ఇతర కార్యక్రమాలు ఏవీ ఆ రోజు పెట్టుకోవద్దని చెప్పేశారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడు? అనేది త్వరలో ఖరారు చేయనున్నారు. 


అతి త్వరలోనే పెళ్లి కబురు!
Varun Tej Lavanya Tripathi Marriage : వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే విషయం ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు. ఆల్రెడీ తెలిసిన విషయమే. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ... ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 


ప్రేమ విషయం ఎప్పుడు బయట పడింది?
'మిస్టర్'లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి తొలిసారి జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 'అంతరిక్షం'లో మరోసారి జంటగా నటించారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వరుణ్ తేజ్ సోదరి నిహారికా కొణిదెల‌ వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్నారు. రీతూ వర్మతో కలిసి వెళ్లారు. నిహారికకు వాళ్ళిద్దరు స్నేహితులే. అయితే... వరుణ్ తేజ్ ప్రేమ విషయం కూడా ఆ పెళ్ళిలో బయట పడింది. మెగా ఫ్యామిలీకి చెల్లెలి పెళ్ళిలో తన ప్రేమ సంగతి చెప్పారట.


Also Read శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం


ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సెట్స్ మీద ఉంది. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఆయన విదేశాలు వెళ్లి వచ్చారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.  మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి సమయానికి షూటింగులు ఏవీ లేకుండా ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలకు ఆ విషయం చెప్పేశారట.  


Also Read : తమన్నాకు రజనీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?