ప్రతినాయకుడు ఎంత బలవంతుడు అయితే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుందని నమ్మే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు గమనిస్తే... విలన్ క్యారెక్టర్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బట్, ఫర్ ద ఫస్ట్ టైమ్... 'వారణాసి'లో ప్రతినాయకుడిని చక్రాల కుర్చీకి పరిమితం చేశారు రాజమౌళి. అయితే టెక్నాలజీతో ఆ విలన్ ఏం చేస్తాడు? అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఆ విలన్ కోసం ఒక సాంగ్ క్రియేట్ చేశారు. అది రిలీజ్ చేశారు.

Continues below advertisement

రణ కుంభ ఆడియో సాంగ్ వచ్చేసింది!'వారణాసి' సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్'లో విడుదల చేశారు. ఆ రోల్ కాకుండా శ్రీరాముడిగా కూడా నటించారని రాజమౌళి వెల్లడించారు. హీరో రోల్ పక్కన పెడితే... విలన్ కుంభ పాత్రలో మలయాళ స్టార్ హీరో, దర్శక - నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆయన లుక్ ఈవెంట్ కంటే ముందుగా విడుదల చేశారు. ఈవెంట్‌లో విలన్ కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన 'రణ కుంభ' సాంగ్ ప్లే చేశారు కీరవాణి. ఆ ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో విడుదల చేశారు.

Also Read: యూట్యూబ్‌లోకి 'వారణాసి' ఈవెంట్ ఫుల్ వీడియో... ఫ్రీగా చూడొచ్చు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అక్కర్లేదు

Continues below advertisement

పృథ్వీరాజ్ నటనపై ప్రియాంక ప్రశంసలు!'వారణాసి' టైటిల్ రివీల్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటనపై గ్లోబల్ స్టార్ - హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో పృథ్వీరాజ్ నటన టెర్రిఫిక్ అన్నారు. సినిమాలో పాత్రకు, నిజ జీవితంలో అతనికి చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా సాఫ్ట్ అని ఆవిడ పేర్కొన్నారు. 

'వారణాసి' సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్వరపరిచిన బాణీకి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. 'రణ కుంభ' పాటతో పాటు శృతి హాసన్ పాడిన 'సంచారి సంచారి' పాటకు సైతం చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు.

Also Readనయనతారకు భర్త సర్‌ప్రైజ్... బర్త్ డే గిఫ్ట్ అదిరింది విఘ్నేషూ - ఆ కారు రేటెంతో తెలుసా!?