Varalaxmi Sarathkumar's Directorial Debut SARASWATHI Update: డిఫరెంట్ స్టోరీస్, వైవిధ్యమైన పాత్రలతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు తాజాగా డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. శనివారం తాను డైరెక్ట్ చేయబోయే మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు.

హై కాన్సెప్ట్ థ్రిల్లర్ 'సరస్వతి'

నటిగా ఎన్నో థ్రిల్లర్ మూవీస్‌లో నటించి మెప్పించిన వరలక్ష్మి డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీనే థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. 'సరస్వతి' అంటూ హై కాన్సెప్ట్ థ్రిల్లర్‌ను అనౌన్స్ చేశారు. తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి ఈ మూవీని నిర్మించబోతున్నారు. చిత్ర నిర్మాణ ప్రపంచంలో ఓ బెస్ట్ జర్నీ కొనసాగించేందుకు ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ 'దోస డైరీస్'ను ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో 'సరస్వతి' ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.

టైటిల్‌లోనే డిఫరెంట్

ఈ మూవీ టైటిల్ రూపొందించిన విధానమే ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. హై కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'SARASWATHI' (సరస్వతి) ఐను హైలైట్ చేయడం మరింత ఆసక్తి పెంచేసింది. ఈ ప్రాజెక్టులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా... ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు మూవీ టీం తెలిపింది.

Also Read: ఓటీటీలోకి యూత్ ఫుల్ 'లిటిల్ హార్ట్స్' - థియేటర్‌లో మిస్ అయిన సీన్స్‌తో కలిపి చూసెయ్యండి... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వరలక్ష్మి శరత్ కుమార్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ పలు మూవీస్‌లో నటించారు. 'తెనాలి రామకృష్ణ' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె... క్రాక్, యశోద, వర ఐపీఎస్, వీరసింహారెడ్డి, మైఖేల్, ఏజెంట్, కోటబొమ్మాళి పీఎస్, హనుమాన్, శబరి, ఆర్టీఐ మూవీస్‌లో నటించి మెప్పించారు. తాాజాగా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గానూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.