పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కమర్షియల్ పోలీస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ హీరోగా 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో ఫ్యాన్స్, ఆడియన్స్, పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా బజ్ నెలకొంది. రీసెంట్‌గా మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ టాక్ ఎలా ఉంది? మూవీ రన్ టైమ్ ఎంత? అనేది చూస్తే...

రెండున్నర గంటల సినిమా...ఇంటర్వెల్ ముందు, తర్వాత?Ustaad Bhagat Singh Runtime: 'ఉస్తాద్ భగత్ సింగ్' రన్ టైమ్ తక్కువే. రీసెంట్ స్టార్ హీరోల సినిమాలు చాలా వరకు మూడు గంటల నిడివితో వచ్చాయి. కానీ, పవన్ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలే. పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే... 2.33.49 గంటలు. 

'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ హాఫ్ రన్ టైమ్ 1.11 గంటలు. సెకండ్ హాఫ్ రన్ టైమ్ 1.22 గంటలు. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ హాఫ్స్ అని చెప్పాలి. కమర్షియల్ సినిమా గనుక ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుకు వెళుతుందని తెలిసింది.

Also Read: స్టార్ హీరోలైనా వీళ్ళిద్దరూ చెప్పింది చేయాల్సిందే... పూరి ఛాన్స్‌తో టాప్ ప్లేసుకు, ఈ అన్నదమ్ములు ఎవరో తెలుసా?

సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది?సినిమాపై బోర్డ్ మెంబర్స్ టాక్??'ఉస్తాద్ భగత్ సింగ్'కు సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశించే అంశాలను హరీష్ శంకర్ ఇవ్వడంలో మరోసారి ఫుల్ సక్సెస్ అయ్యారట. పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ చేత ఫెంటాస్టిక్ అనేలా పెర్ఫార్మన్స్ కూడా చేయించాడట. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో నడిచిందని సెన్సార్ బోర్డు నుంచి లీక్ వచ్చింది.

Also ReadAnantha Sriram: నేను సరస్వతి పుత్రుణ్ణి కాదు... ఆయనకు అనంత శ్రీరామ్ కౌంటర్?

'ఉస్తాద్ భగత్ సింగ్'కు ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ అయితే ఆఫ్ స్క్రీన్ హీరో తప్పకుండా హరీష్ శంకర్ అనేది ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగ్గ కమర్షియల్ ఫిల్మ్ తీశారని అంటున్నారు. కథ పరంగా కొంత మంది విమర్శకుల నుంచి కంప్లైంట్స్ రావచ్చు. కానీ స్టార్ హీరో సినిమాకు అవసరమైన కంటెంట్ ఇచ్చారట. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?