Upendra Movie Re Release Date: ప్రస్తుతం రీ రిలీజ్‌లు ట్రెండ్ అవుతున్న క్రమంలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఒకప్పటి కల్ట్ క్లాసిక్ 'ఉపేంద్ర' మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999, అక్టోబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం. కొన్ని అభ్యంతరకర డైలాగ్స్, కంటెంట్ ఉన్నప్పటికీ ఉపేంద్ర సహజమైన నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. 

Continues below advertisement

రీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ నెల 11న 'ఉపేంద్ర' మూవీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనుంది. 'గెట్ రెడీ ఫర్ మ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ది కల్ట్ క్లాసిక్ 'ఉపేంద్ర' థియేటర్లలోకి వచ్చేస్తోంది.' అంటూ రాసుకొచ్చారు. ఈ మూవీలో ఉపేంద్ర హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. రవీనా టాండన్, ప్రేమ, దామిని కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస ప్రొడక్షన్ బ్యానర్‌పై శిల్పా శ్రీనివాస్ నిర్మించారు. గురుకిరణ్ మ్యూజిక్ అందించగా సాంగ్స్ అప్పట్లో ట్రెండింగ్‌గా నిలిచాయి.

Continues below advertisement

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'వార్ 2' - 3 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?

స్టోరీ ఏంటంటే?

నిజం చెప్పాలన్న పెద్దల మాటను తూ చ తప్పకుండా చిన్నప్పటి నుంచే ఇబ్బందుల్లో పడతాడు ఉపేంద్ర. దీంతో సమాజంతో సంబంధం లేకుండా తనదైన శైలిలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. పెద్దయ్యాక తల్లిదండ్రులను కానీ కుటుంబాన్నీ కానీ చుట్టూ ఉన్న వారిని కానీ పట్టించుకోకుండా కేవలం తానేం అనుకుంటాడో అదే చేస్తాడు. అచ్చంగా చెప్పాలంటే ఓ పిచ్చొడిలా బిహేవ్ చేస్తుంటాడు. అలాంటి ఉపేంద్రను ఓ అమ్మాయి ఇష్టపడుతుంది. ఉపేంద్ర మాత్రం వేరే అమ్మాయిని ఇష్టపడతాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడా? అసలు ఉపేంద్ర అలా ఎందుకు మారాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.