‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కాస్త ఎక్కువ బ్రేకే తీసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో ఉన్న చరణ్‌కు మళ్లీ కాస్త తీరిక దొరికింది. దీంతో తాజాగా ఉపాసనతో కలిసి ఒక హాలిడేకు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో కనిపించారు. అయితే, వారు ఎక్కడికి వెళ్తున్నారనేది ఎవరికి తెలియరాలేదు. ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలతో అసలు విషయం తెలిసింది. ఉపాసన తన ఫ్రెండ్ పెళ్లికి చరణ్‌తో కలిసి పారిస్ వెళ్లింది. ‘‘కంగ్రాట్స్ డియర్ రోజ్‌మిన్, చాలా సంతోషంగా ఉంది, పారిస్‌లో మరికొన్ని హాలిడేలు జరుపుకోవాలి’’ అంటూ తన ఫ్రెండ్ రోజ్‌మిన్‌ను ట్యాగ్ చేశారు ఉపాసన. ఇందులో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు ఫ్రెండ్స్‌తో ఫోటోలకు పోజులిచ్చారు ఉపాసన.






ఓవైపు ‘గేమ్ ఛేంజర్’.. మరోవైపు ‘ఇండియన్ 2’..
ఉపాసన, రామ్ చరణ్ గత కొన్నిరోజులుగా కొత్తగా పేరెంట్స్ అయిన సంతోషంలో ఉన్నారు. అంతే కాకుండా పేరెంట్స్‌గా బాధ్యతలు స్వీకరించి బిజీగా ఉన్నారు. తమ ముద్దుల కూతురు క్లిన్ కారాతో వారు గడుపుతున్న సమయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఉపాసన. ఇక చాలాకాలం బ్రేక్ తర్వాత రామ్ చరణ్.. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ చిత్ర దర్శకుడు శంకర్.. ఓవైపు ‘గేమ్ ఛేంజర్’, మరోవైపు ‘ఇండియన్ 2’ షూటింగ్‌ను మ్యానేజ్ చేయడానికి చూస్తుండడంతో ‘గేమ్ ఛేంజర్’కు కాస్త బ్రేక్ పడింది.


‘గేమ్ ఛేంజర్’ ఊసే లేదు..
‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు రామ్ చరణ్. అందుకే చరణ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువయిపోయింది. అందుకే చరణ్ ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఆయన మూవీ షూటింగ్స్ అప్డేట్స్ ఏంటి అని తెలుసుకోవాలని అభిమానులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై సంవత్సరం దాటిపోయింది. అయినా ‘గేమ్ ఛేంజర్’ గురించి పెద్దగా అప్డేట్స్ లేవు. అప్పుడెప్పుడో ఒక మోషన్ పోస్టర్ ద్వారా టైటిల్ రివీల్ చేసిన తర్వాత మూవీ టీమ్ నుండి మళ్లీ ఎలాంటి విషయం తెలియలేదు. దీంతో అప్పుడప్పుడు రామ్ చరణ్ షేర్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులతోనే ఫ్యాన్స్ తృప్తిచెందుతున్నారు. ఓవైపు రామ్ చరణ్ ప్రొఫెషనల్ లైఫ్ మెల్లగా సాగుతుంటే.. ఉపాసన మాత్రం తాజాగా సింగిల్ మథర్స్ కోసం అపోలో హాస్సిటల్స్ సేవలను మరింత మెరుగుపరుస్తూ, వారికి మరింత చేయూతగా ఉండడం కోసం కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. 


Also Read: మృణాల్ కష్టాలు, టాలీవుడ్ మూవీస్ కోసం తెలుగు నేర్చుకుంటున్న ముద్దుగుమ్మ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial