Upasana Peddi Premiere: 'పెద్ది' ప్రీమియర్‌లో ఉపాసన... పేపర్లు ఎగరేసిన రామ్ చరణ్ భార్య
Upasana Celebrates Peddi Success: హైదరాబాద్ శ్రీ రాములు థియేటర్‌లోని 'పెద్ది' ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి చూశారు రామ్ చరణ్ భార్య ఉపాసన. ఆవిడ సందడి ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ (Ram Charan) లేటెస్ట్ సినిమా 'పెద్ది' (Peddi) సందడి బాక్సాఫీస్ దగ్గర జూన్ 3వ తేదీ రాత్రి నుంచి మొదలైంది. ప్రీమియర్ షోలు ప్రదర్శించిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర అభిమానుల సంబరాలు, కోలాహలం పండగ వాతావరణాన్ని తలపించింది. హైదరాబాద్ మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌లో సందడి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే... రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) అభిమానులతో కలిసి ఆ థియేటర్‌లో 'పెద్ది' సినిమా చూశారు.
విజిల్స్... పేపర్లు ఎగరేసిన ఉపాసన
తల్లిదండ్రులతో కలిసి శ్రీరాము థియేటర్‌కు ఉపాసన వచ్చారు. దాంతో ఫ్యాన్స్ ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఇక షో మొదలైన తర్వాత... 'పెద్ది'గాడి పాత్రలో తెరపై రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వగానే... గాల్లోకి పేపర్లు ఎగరేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు ఉపాసన.
శ్రీరాములు థియేటర్‌లో ఉపాసన చేసిన సందడి, ఆ వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. క్రికెట్ గ్రౌండ్‌లో రామ్ చరణ్ స్టైలిష్ మాస్ ఎంట్రీ చూసి అభిమానుల వేసిన ఈలలు, కేకలతో థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. ఆ సందడికి ఉపాసన తోడు కావడం స్పెషల్. రామ్ చరణ్ తెరపై కనిపించిన ప్రతి సన్నివేశంలో ఉపాసన ముఖంలో నవ్వులు కనిపించాయి. భర్తకు భార్య కంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరూ లేరంటూ కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Upasana throws papers for a scene in #Peddi film along with the fans at Sreeramulu theatre pic.twitter.com/kZLW2scBnf
— idlebrain.com (@idlebraindotcom) June 3, 2026
ఒక్క హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు... ఏపీలో ప్రీమియర్ షోలు పడిన స్క్రీన్స్, అలాగే బెంగళూరులో 'పెద్ది' ప్రీమియర్లు పడిన థియేటర్లలో మెగా అభిమానుల సందడి భారీ ఎత్తున కనిపించింది. బెంగళూరులో బృంద థియేటర్ దగ్గర మెగా అభిమానులు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇంకా కొంత మంది అభిమానులు థియేటర్ల దగ్గర భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అయితే... ఉపాసన స్వయంగా థియేటర్‌కు వచ్చి అభిమానులతో కలిసి ప్రీమియర్స్ సంబరాల్లో పాల్గొనడం సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
Konidela Upasana Garu Along With Her Family At Peddi Premiere Show...✨#peddi #ramcharan @AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/sjc5uRKyp5
— Indian Clicks (@IndianClicks) June 3, 2026
రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది' సినిమా రూపొందింది. ఇందులో రామ్ చరణ్ స్పోర్ట్స్ ప్లేయర్ రోల్ చేశారు. మొదట క్రికెట్, ఆ తర్వాత కుస్తీ, అక్కడ నుంచి రన్నింగ్... ఓ ఆట తర్వాత మరొక ఆట... మూడు ఆటల్లో కనిపించారు. రామ్ చరణ్ సరసన అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, రవి కిషన్, ఉపేంద్ర లిమయే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















