తమది 'అగ్లీ స్టోరీ' (Ugly Story) అంటున్నారు నందు (Actor Nandu). ఆయన హీరోగా యాక్ట్ చేస్తున్న కొత్త సినిమా టైటిల్ అదే మరి. అందులో అవికా గోర్ (Avika Gor) హీరోయిన్. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ అండ్ బోల్డ్ సీన్స్, అపరిచితుడు తరహాలో నందు వేరియేషన్స్ చూపించడంతో ఆ టీజర్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది.

Continues below advertisement

అవికాను వేధించిన నందు...బోల్డ్ 'అగ్లీ స్టోరీ' టీజర్ చూశారా?అవికాను వేధించిన నందు అంటే అవికాను కాదు! 'అగ్లీ స్టోరీ' టీజర్ చూస్తే... ప్రేమ లేదా కామంతో హీరోయిన్ మీద ఇష్టం పెంచుకుని తనను కాకుండా ఆ అమ్మాయి మరొకరిని ప్రేమించిందని వేధింపులకు గురి చేసే హీరో పాత్రలో నందు కనిపించారు. ఆ హీరోయిన్ రోల్ అవికా గోర్ చేశారు. ఆమె ప్రేమించిన అబ్బాయిగా రవితేజ మహాదాస్యం నటించారు.

Also Read: మెగా హీరోలకు డిజాస్టర్ ఇచ్చిన క్యారెక్టర్... శ్రీవిష్ణు హిట్టు కొడతాడా?

Continues below advertisement

స్కూల్ డేస్ నుంచి అవికా గోర్, నందు క్లాస్‌మేట్స్‌ అన్నట్టు 'అగ్లీ స్టోరీ' టీజర్‌లో చూపించారు. మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అని అర్థం అవుతూ ఉంది. తాను మరొక అబ్బాయిని ప్రేమించానని, అతడిని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామని హీరోయిన్ చెప్పినా సరే హీరో వదలడు. ఆమె వెంట పడతాడు. వేధిస్తాడు. చివరకు మీడియా ముందుకు వచ్చి కపట నాటకం ఆడతాడు. మరి వీళ్ళ కథ ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 'వాళ్ళది ప్రేమ, అందుకే కలిసుకున్నారు. నీది కోరిక... అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్!' అని డైలాగ్ వస్తుంటే... స్క్రీన్ మీద అవికా గోర్ - రవితేజ మహాదాస్యం పెళ్లిని, ఆస్పత్రిలో పెషెంట్‌గా నందును చూపించారు.

Also Readమళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!

Ugly Story Cast And Crew: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న 'అగ్లీ స్టోరీ'ని రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణవ స్వరూప్ దర్శకుడు. శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం, ప్రజ్ఞా నయన్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీసాయికుమార్‌ దారా, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్, కళా దర్శకుడు: విఠల్ కోసనం, కథ - స్క్రీన్‌ ప్లే - మాటలు - దర్శకత్వం: ప్రణవ స్వరూప్‌.