అన్వేషించండి

Uday Kiran: ఉదయ్ కిరణ్‌లో ఆ రెండు భయాలు ఎక్కువ... బయట పెట్టిన ఫ్రెండ్ & డైరెక్టర్

Uday Kiran Latest News: ఉదయ్ కిరణ్ అంటే అభిమానం చూపించే ప్రేక్షకులు ఎంతో మంది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏళ్ళు గడుస్తున్నా అభిమానం తగ్గడం లేదు. ఆయన ఫ్రెండ్ తాజాగా ఉదయ్ కిరణ్ భయాలను బయటపెట్టారు.

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ (Uday Kiran) పేరు గుర్తు వచ్చినప్పుడల్లా తెలుగు ప్రేక్షకుల మనసు భారంతో నిండిపోతోంది. కెరీర్ ప్రారంభంలోనే వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి సంచలనం సృష్టించి ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడంపై  ఆయన అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం సానుభూతి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటీవల వాలెంటైన్స్ డేకి రీ రిలీజ్ అయిన 'మనసంతా నువ్వే' సినిమాకు ఈ తరం యువతరం కూడా బ్రహ్మరధం పట్టింది. ఆ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్ ,ఉదయ్ కిరణ్ తో  రెండు సినిమాలు (మనసంతా నువ్వే, శ్రీ రామ్ ) తీసిన V. N. ఆదిత్య... ఉదయ్ కిరణ్ తో తన అనుబంధం గురించి, 'మనసంతా నువ్వే' సినిమా  విశేషాల గురించి పంచుకున్నారు.

ఉదయ్ కిరణ్ కు ఆ రెండు భయాలు ఉండేవి 
'మనసంతా నువ్వే' ఉదయ్ కిరణ్ కు హ్యాట్రిక్ మూవీ. దానికంటే ముందు తేజ దర్శకత్వం లో 'చిత్రం', 'నువ్వే నువ్వే' లాంటి రెండు పెద్ద హిట్స్ ఉన్నాయి. అయితే ఆ రెండింటిలో లేని కొన్ని ఎమోషనల్ సీన్స్ 'మనసంతా నువ్వే'లో ఉదయ్ తో చేయించారు ఆదిత్య. వాటిలో ఒకటి సినిమాలో సెకండ్ హీరోయిన్ తను రాయ్ స్నేహితురాలి ఇంట్లో జరిగే పెద్ద మనిషి పండుగలో మంగళ హారతి పాడే సన్నివేశం ఉంటుంది. అమ్మాయిలందరి మధ్య మంగళ హారతి పాడుతుంటే థియేటర్ లో ఆడియన్స్ నవ్వుతారేమో అనే ఉదయ్ కిరణ్ విపరీతంగా భయపడ్డాడు అట. అలానే సినిమా చివర్లో  విలన్ పాత్ర వేసిన తనికెళ్ళ భరణితో 'చిన్నప్పుడు నిన్ను కొడదాం అనుకుంటే అమ్మ అడ్డు వచ్చింది. ఇప్పుడు కొడదాం అనుకుంటే చెల్లి అడ్డు వచ్చింది' అనే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా అంతే భయపడ్డాడు అట. ఆ సినిమాకు ముందు చేసిన 'నువ్వు నేను'లో  'ఈ పెద్దోళ్ళు ఉన్నారే' అనే డైలాగ్స్ మీద జోక్స్ గట్టిగా ఉండేవి. దానితో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమో అని ఆందోళనకు గురయ్యాడట ఉదయ్ కిరణ్. థియేటర్ లో 'మనసంతా నువ్వే' ఫస్ట్ షో నడుస్తుండగా పక్కనే కూర్చున్న డైరెక్టర్ ఆదిత్య చెయ్యి గట్టిగా పట్టేసుకుని భయపడుతుండగా "ఏం కాదులే బాగా చేసావ్" అంటూ ఆయన ధైర్యం చెప్పారు అట. కానీ ఆ సీన్ థియేటర్లో బాగా పేలడంతో ఉదయ్ కిరణ్ రిలీఫ్ గా ఫీల్ అయినట్టు VN ఆదిత్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. మనసంతా నువ్వే ఎంత పెద్ద హిట్ అంటే ఈ సినిమాను కన్నడ, తమిళ, హిందీ భాషలతో సహా బంగ్లాదేశ్  లోనూ రీమేక్ చేశారు. 'చిత్రం' నటించిన రీమా సేన్ ఈ సినిమా లోనూ ఉదయ్ పక్కన నటించడం తో వీరిది హిట్ పెయిర్ గా ముద్ర పడింది.

Also Read: Chiranjeevi: చిరంజీవి హిట్ సినిమా... ఓసారి ర‌జ‌నీ, మ‌రోసారి ధ‌నుష్‌ - రెండు తమిళ్ రీమేక్స్ ఏవో తెలుసా?

'మనసంతా నువ్వే' తరువాత 'శ్రీ రామ్' 
'మనసంతా నువ్వే' సినిమా తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా మరో సినిమా 'శ్రీ రామ్' తీశారు డైరెక్టర్ V.N.ఆదిత్య. ఆ మూవీతో ఉదయ్ కిరణ్ ను యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేశారు. దానిలో ఉదయ్ కిరణ్ తో 'నువ్వే నువ్వే'లో నటించిన అనిత హీరోయిన్. ఆ సినిమా కూడా డీసెంట్ హిట్ అయింది. కొన్నేళ్ల గ్యాప్ తరువాత ఉదయ్ కిరణ్ తో మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్న తనకు ఉదయ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసి షాక్ కు గురయినట్టు చెప్పుకొచ్చారు V N ఆదిత్య.

Also ReadBookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Allu Arjun: అల్లు అర్జున్ భార్యకు అదిరిపోయే గిఫ్ట్... మ్యారేజ్ డే స్పెషల్... స్నేహారెడ్డికి బన్నీ సర్ప్రైజ్!
అల్లు అర్జున్ భార్యకు అదిరిపోయే గిఫ్ట్... మ్యారేజ్ డే స్పెషల్... స్నేహారెడ్డికి బన్నీ సర్ప్రైజ్!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Ustaad Bhagat Singh Trailer Tease: దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
దమ్మున్నోడు దాటొచ్చు... 'ఉస్తాద్' ట్రైలర్‌కు ముందు పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget