Anupam Kher: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఆఫీసులో చోరీ జరిగింది. బుధవారం రాత్రి దొంగలు.. ఆయన ఆఫీస్ డోరును పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. వారు ఒక లాకర్‌ను మొత్తం ఎత్తికెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ లాకర్‌లో అనుపమ్ ఖేర్ సంస్థ నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన నెగిటివ్స్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా ఉన్నాయని ఈ నటుడు స్వయంగా ప్రకటించారు. ఈ విషయం గురించి చెప్తూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో తన ఆఫీస్ డోర్లకు ఉన్న తాళాలను ఎలా పగలగొట్టారో చూపించారు. అంతే కాకుండా దొంగతనానికి సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకున్నారు అనుపమ్ ఖేర్.
ఆటోలో పారిపోయారు..
‘గత రాత్రి వీర దేశాయ్ రోడ్‌లోని నా ఆఫీస్‌కు ఉన్న రెండు తలుపులను ఇద్దరు దొంగలు బద్దలుకొట్టారు. వాళ్లు అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లో ఉండే ఒక లాకర్‌ను మొత్తం ఎత్తుకెళ్లిపోయారు. వాళ్లు దానిని బద్దలుకొట్టలేక ఈ పని చేసుంటారు. మా కంపెనీ నిర్మిస్తున్న ఒక సినిమాకు సంబంధించిన నెగిటివ్స్ అన్నీ ఆ బాక్స్‌లో ఉన్నాయి. మేము ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశాం. దొంగలను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు పరిశీలించిగా వారిద్దరూ ఒక ఆటోలో పారిపోయినట్టు తెలిసింది. వారికి దేవుడు కొంచెం జ్ఞానాన్ని ప్రసాదిస్తే బాగుంటుంది. పోలీసులు వచ్చే ముందు మా ఆఫీస్ వాళ్లు ఈ వీడియోను తీశారు’ అంటూ వీడియోను షేర్ చేశారు అనుపమ్ ఖేర్.
రంగంలోకి పోలీసులు..
ఒక యాక్టర్ అయిన అనుపమ్ ఖేర్ ఆఫీసులో దొంగలు చొరబడి లాకర్‌ను ఎత్తుకెళ్లడం అనే వార్త బీ టౌన్‌లో వైరల్ అయ్యింది. అంత జాగ్రత్తగా ఉన్నా కూడా అసలు దొంగలు ఎలా వచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయినా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది కాబట్టి పోలీసులు.. త్వరలోనే దొంగలను పట్టుకుంటారని వారు అనుకుంటున్నారు. లాకర్‌లో సినిమాకు సంబంధించిన నెగిటివ్స్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని బయటపెట్టిన అనుపమ్ ఖేర్.. అవేంటి అని మాత్రం చెప్పలేదు. దీంతో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
టాలీవుడ్‌లో బిజీ..
అనుపమ్ ఖేర్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో కూడా బిజీ అవుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. హిందీలో కూడా మళ్లీ ఈ నటుడు బిజీ అయ్యారు. ఆయన చివరిగా వీకే ప్రకాశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాగజ్ 2’లో కనిపించారు. ఇది మలయాళ చిత్రం అయిన ‘నిర్ణయకం’కు రీమేక్‌గా తెరకెక్కింది.
Also Read: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా బ్యాక్‌డ్రాప్ అదేనా?