Trisha Reaction About Trollings Amid Dating Rumours : తమిళనాడు ఎన్నికల నుంచీ సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టినంత వరకూ దళపతి, త్రిష ఇద్దరూ తరచూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఎన్నికల్లో విజయ్‌కు త్రిష సపోర్ట్ చేయడం సహా సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సౌత్ క్వీన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. 

Continues below advertisement

పెంపుడు కుక్క ఫోటోతో...

జనరల్‌‌గా ఇలాంటి రూమర్స్, వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ స్పందించని త్రిష (Trisha Krishnan) ఫస్ట్ టైం ఈ రూమర్స్‌పై పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆమె ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్క ఫోటో షేర్ చేసిన త్రిష... దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు. 'నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి దీనికి తప్ప ఎవరికీ పర్మిషన్ లేదు.' అని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు.

Continues below advertisement

నేరుగా ఎవరి పేరు కూడా మెన్షన్ చేయకపోయినా... తనపై ట్రోలింగ్స్, రూమర్స్ క్రియేట్ చేసే వారికి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గానే త్రిష 'మ్యాజికల్ మే' అంటూ ఫోటోస్ షేర్ చేశారు. 'నాకు ఇష్టమైన మంత్ వచ్చేసింది. ఈ ఏడాది మే నెలను తలుచుకున్నప్పుడల్లా నా ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుంది.' అంటూ పోస్ట్ చేశారు. ఇందులో బర్త్ డే మూమెంట్స్ సహా, సెల్ఫీలు, పెట్ డాగ్ ఫోటోస్ ఉన్నాయి.

Also Read : Peddi Collection : సోషల్ మీడియా ట్రెండింగ్‌ పెద్ది - రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్... తెలంగాణలో బుకింగ్స్ ఎప్పుడంటే?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.