మైథాలజీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. పురాణ ఇతిహాసాలు, హిందూ ధర్మంపై కథలకు ఆసక్తి పెరుగుతోంది. సనాతన ధర్మం గురించి ఎక్కువ వినబడుతోంది. ఇప్పటి వరకు భారతీయ సనాతన ధర్మం (Sanatan Dharma)లోని రహస్యాలు ఆధారంగా చేసుకుని, ఎవరు టచ్ చేయమని పాయింట్‌తో మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా 'త్రికాల' (Trikaala Movie) రూపొందించామని దర్శకుడు మణి తెల్లగూటి తెలిపారు. ఈ నెలాఖరున సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

మే 29న శ్రద్ధా దాస్ 'త్రికాల' విడుదల'త్రికాల' సినిమాలో హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) ప్రధాన పాత్రధారి. ఇంకా ఈ సినిమాలో మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా... రాధిక, శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ విడుదల చేస్తోంది. మే 29న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

'త్రికాల' గురించి దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ… ''ప్రపంచమంతా చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగులా అవతరించే శక్తి చుట్టూ చిత్ర కథ సాగుతుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ మధ్య కాలంలో మైథలాజీ అంశాలతో వచ్చిన థ్రిల్లర్స్ విజయాలు సాధించాయి. మా సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని నమ్మకం ఉంది. మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ ఫుల్ పాత్ర, శ్రద్ధా దాస్ కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులకు మా సినిమా ఒక కొత్త అనుభూతి ఇస్తుందనే ధీమా ఉంది'' అని చెప్పారు.

Continues below advertisement

Also Read: Kamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

సంగీతం అందించిన 'యానిమల్' హర్షవర్ధన్!తమ సినిమాకు 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారని నిర్మాతలు రాధికా - శ్రీనివాస్ తెలిపారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ… ''మన సంస్కృతి, ఆధ్యాత్మికత అంశాలతో మిళితమైన ఈ కథ ప్రేక్షకులకు నచ్చుతుంది. మా చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్ & డబ్బింగ్ హక్కులు మంచి రేటుకు అమ్ముడు అయ్యాయి'' అని చెప్పారు.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

Trikaala Cast And Crew: శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌ - విడుద‌ల‌: చాగంటి ప్రొడక్షన్, నిర్మాతలు: రాధిక - శ్రీనివాస్, సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా - వెంకట్ రమేష్ దాడి, ఛాయాగ్రహణం: ప‌వ‌న్ చెన్న, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నేపథ్య సంగీతం: షాజిత్ హుమాయున్, కథ - దర్శకత్వం: మణి తెల్లగూటి.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్