Sathya Raj's Tribhanadhari Barbarik OTT Streaming: సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'త్రిబాణధారి బార్బరిక్' ఓటీటీలోకి వచ్చేసింది. తొలుత ఒకే ఓటీటీలోకి వస్తుందని ప్రకటించినా తాజాగా మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డిఫరెంట్ టైటిల్‌తో ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఆ 2 ఓటీటీల్లో...
ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో 'త్రిబాణధారి బార్బరిక్' స్ట్రీమింగ్ అవుతోంది. 'ఒక తాత. తప్పిపోయిన మనవరాలు. ఒక పురాణం పునర్జన్మ.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పాటే మరో ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీలో సత్యరాజ్, ఉదయభానులతో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్‌రెడ్డి నిర్మించారు. సత్యరాజ్ డాక్టర్ శ్యామ్‌గా కీలక పాత్ర పోషించగా... నెగిటివ్ రోల్‌లో చాలా రోజుల తర్వాత ఉదయభాను రీఎంట్రీ ఇచ్చారు.
Also Read: మహేష్, రాజమౌళి 'SSMB29' అప్డేట్ - నవంబరులో ఓకే... సర్‌ప్రైజ్ ఆ రోజే!
స్టోరీ ఏంటంటే?
ఆ ఊరిలోనే పేరొందిన సైక్రియాట్రిస్ట్ శ్యామ్ కతు (సత్యరాజ్). కొడుకు, కోడలు చనిపోవడంతో తన మనవరాలు నిధి (మేఘన)ని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఓ రోజు స్కూల్‌కు వెళ్లిన నిధి కనిపించకుండా పోతుంది. దీంతో కంగారుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు శ్యామ్. పోలీస్ విచారణ టైంలో కీలక విషయాలు బయటపడతాయి. ఇక లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) మేనల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్)కు పాప మిస్సింగ్ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు వీరిద్దరూ చేస్తోన్న అక్రమ వ్యాపారాలు ఏంటి? తన మనవరాలిని శ్యామ్ కనిపెట్టగలిగాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.