Toxic Telugu Teaser : యశ్ 'టాక్సిక్' టీజర్ - మోస్ట్ వయలెంట్ వీడియో చూశారా?
Toxic Teaser Review : అవెయిటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' టీజర్ వచ్చేసింది. రాకింగ్ స్టార్ యశ్ తన విశ్వరూపం చూపించారు. ఇంతకు ముందెన్నడూ చూడని వయలెన్స్ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Yash's Toxic Movie Telugu Teaser Review : రాకింగ్ స్టార్ యశ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' టీజర్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఇంట్రడక్షన్ వీడియోను మించిన పదింతలు హైప్ ఇచ్చేలా లేటెస్ట్ వీడియో ఉంది.
టీజర్ ఎలా ఉందంటే?
KGFను మించి అంచనాలు మరింత పెంచేలా టీజర్ కట్ ఉండగా వయలెన్స్ ఎవరూ ఊహించలేరు. ఓ పార్టీలో అందరూ ఫుల్ ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉండగా... 'ఈసారి యుద్ధం వేరు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. గోవా బ్యాక్‌డ్రాప్‌గా సాగే మాఫియా సామ్రాజ్యం ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. యశ్ యాక్షన్ ఎలివేషన్ అదిరిపోయింది.
'అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు. పట్టుదల వదిలెయ్. గివ్ అప్ రాయ' అనే డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అత్యంత మోస్ట్ వయలెన్స్ టీజర్‌లో చూపించారు. ఓ సామాన్యుడు మాఫియా సామ్రాజ్యానికి లీడర్‌గా మారేందుకు ఏం చేశాడు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది.
Also Read : అమ్మ కాళ్లు కడిగి నీళ్లు తాగిన బాలీవుడ్ హీరో - ఓన్లీ కాంట్రవర్సీస్ మాత్రమే కాదు...
ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా... యశ్ 'రాయ'గా కనిపించనున్నారు. అలాగే ఐదుగురు హీరోయిన్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కియారా అద్వానీ నదియా పాత్రలో కనిపిస్తుండగా... ఎలిజిబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనున్నారు.
అందమైన సముద్ర తీరం చుట్టూ నేర సామ్రాజ్యం, మాఫియా, సిండికేట్స్, వయలెన్స్ ఇలా అన్నింటి మధ్య ఓ సామాన్యుడు పడ్డ ఇబ్బందులు, వీటిని అధిగమించిన అతను లీడర్‌గా ఎదిగిన తీరును సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. 1940 -70 గోవా బ్యాక్ డ్రాప్‌గా సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా టాక్సిక్ రూపొందించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా కన్నడతో పాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మార్చి 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
























