Toxic: గడ్డం లేకుండా యశ్... 'యానిమల్'ను గుర్తు చేసేలా లుక్ & సీన్స్!
Toxic Vs Animal: 'టాక్సిక్' వర్సెస్ 'ధురంధర్ 2' రిలీజ్ డేట్స్ డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడు టీజర్ రిలీజ్ తర్వాత 'యానిమల్'తో కంపేరిజన్స్ మొదలయ్యాయి. అది ఏమిటో చూడండి.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash)ను గడ్డం లేకుండా చూశారా? అదీ ఈ మధ్య కాలంలో!? కన్నడ ప్రేక్షకులు అయితే చూసే ఉంటారు. కానీ పాన్ ఇండియా ప్రేక్షకులకు గడ్డం లేని యశ్ గుర్తుకు వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. 'కేజీఎఫ్'తో ఆయన నేషనల్ లెవల్ స్టార్‌డమ్ వచ్చింది. అందులో రాకీ భాయ్ పాత్రలో ఫుల్ గడ్డంతో కనిపించారు. ఆ తర్వాత ఆయన హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా 'టాక్సిక్'. అందులోనూ గడ్డంతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మరో లుక్ రిలీజ్ చేశారు. అదీ గడ్డం లేకుండా!
'టాక్సిక్'లో యశ్ డ్యూయల్ రోల్!
'టాక్సిక్' సినిమాలో యశ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. 'రాయ' పాత్రలో ఆయన లుక్ ఎప్పుడో రిలీజ్ చేశారు. 'టాక్సిక్' టీజర్ ఎండింగ్ చూశారా? గడ్డం లేకుండా చాలా సన్నగా కనిపించారు యశ్. అది మరొక లుక్. అంటే... ఈ మూవీలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారన్నమాట. గడ్డం లేని యశ్ లుక్ ఇవాళ రిలీజ్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరు 'టికెట్' అని తెలిపారు. అది చూశాక చాలా మందికి 'యానిమల్' గుర్తుకు వస్తోంది.
View this post on Instagram
'టాక్సిక్' vs 'యానిమల్' లుక్స్!
రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్'. ఆయన్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్తగా చూపించారు. 'యానిమల్' చూస్తే... ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఓ మనిషి జీవితంలో వివిధ దశలను లుక్స్ రూపంలో చూపించారు రణబీర్. అయితే సినిమా అయ్యాక ఎంట్రీ ఇచ్చిన మరొక క్యారెక్టర్ అజీజ్ మాత్రం నెక్స్ట్ లెవల్. ఆ రోల్ చూసిన చాలా మంది 'విక్రమ్' సినిమాలోని సూర్య రోల్ రోలెక్స్ లుక్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు 'టాక్సిక్' టీజర్ రిలీజ్ అయ్యాక... గడ్డం లేని యశ్ లుక్ చూసి 'యానిమల్'ను గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది.
Also Read: Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
View this post on Instagram
లుక్స్ పరంగా 'యానిమల్'లో అజీజ్, 'టాక్సిక్'లో టికెట్ మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు. అలాగని, రెండు సినిమాలు ఒక్కటేనని - ఆ సీన్స్ సేమ్ టు సేమ్ అని చెప్పలేం. థియేటర్లలో మార్చి 19న సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.























