Toxic Teaser : యశ్ 'టాక్సిక్' టీజర్ డేట్, టైం ఫిక్స్ - వెయిటింగ్ ఫర్ బిగ్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్
Toxic Teaser Update : రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' మూవీ టీజర్‌పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 19న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Yash's Toxic Movie Teaser Release Date Time Locked : రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన అవెయిటెడ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ హీరో ఇంట్రడక్షన్ వీడియో ఇప్పటికే బిగ్ హైప్ క్రియేట్ చేయగా మరో సర్ప్రైజ్ రెడీ అవుతోంది.
టీజర్ ఎప్పుడంటే?
'టాక్సిక్' టీజర్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 19)న ఉదయం 9:35 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఫస్ట్ వీడియోతోనే గూస్ బంప్స్ తెప్పించగా ఇక టీజర్‌తో భారీ యాక్షన్ థ్రిల్ చూపించడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం - వెడ్డింగ్ కార్డ్ లీక్... టీం తీవ్ర అసహనం
స్టోరీ లైన్ అదేనా?
1940 -70 గోవా బ్యాక్ డ్రాప్‌గా సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'టాక్సిక్' రూపొందించినట్లు తెలుస్తోంది. UAE డిస్ట్రిబ్యూటర్ ఫార్స్ ఫిల్మ్స్ ఈ స్టోరీ రివీల్ చేసినట్లు తెలుస్తోంది. అందమైన సముద్ర తీరం చుట్టూ ఉన్న నేర సామ్రాజ్యం, మాఫియా సిండికేట్స్, రక్తపాతం, వెన్నుపోట్లు ప్రధానాంశంగా మూవీ ఉండనున్నట్లు సమాచారం. క్రూరమైన నేర సామ్రాజ్యంలో ఓ సామాన్యుడు తన భయంతో ఎలా ఇబ్బందులు పడ్డాడు? వాటిని అధిగమించి ఆ మాఫియా వరల్డ్‌లో లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే 'టాక్సిక్' స్టోరీ.
'ఏదైనా పని పూర్తి చేయడానికి అతను తనపై తప్ప వేరే ఎవరిపై ఆధారపడడు. స్మగ్లింగ్ మార్గాలు యుద్ధ భూములుగా మారినప్పుడు... వినయ విధేయతలు అనుమానంగా వెన్నుపోటుగా మారితే మానసిక రుగ్మత అతనిలో బిగ్ చేంజ్‌కు కారణమవుతుంది. అన్నీ ఎదుర్కొని ఓ సాధారణ వ్యక్తి పవర్ ఫుల్ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు?' అనేదే స్టోరీ లైన్ అని రివీల్ చేశారు.
టాలీవుడ్ రిలీజ్... బిగ్ డీల్
పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో మూవీ రిలీజ్ కానుండగా... తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'టాక్సిక్' రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు బిగ్ డీల్ కుదిరింది. దిల్ రాజు నిర్మాణ సంస్థ SVC ప్రొడక్షన్స్, చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ హౌస్ మధ్య రూ.120 కోట్లకు ఒప్పందం కుదరగా... ఏపీ, తెలంగాణలో విడుదల చేయనున్నారు.
ఏ రోల్‌లో ఎవరెవరు?
ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా... యశ్ 'రాయ'గా కనిపించనున్నారు. నదియా పాత్రలో కియారా అద్వానీ, గంగ పాత్రలో నయనతార, ఎలిజిబెత్ రాణిని పోలి ఉండే పాత్రలో హుమా ఖురేషీ, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్ నటించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
























