Toxic Movie Story : యశ్ 'టాక్సిక్' మూవీ స్టోరీ లైన్ ఇదేనా! - KGFను మించి చూస్తామా?
Toxic Plot : రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' మూవీ స్టోరీ లైన్ రివీల్ అయ్యింది. 1940 - 70 మధ్య గోవా నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

Yash Kiara Advani Action Thriller Toxic Movie Plot : రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. హీరో ఇంట్రడక్షన్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ కాగా... మరో కేజీఎఫ్ రిపీట్ కానుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ రివీల్ అయ్యింది.
'టాక్సిక్' స్టోరీ ఏంటంటే?
UAE డిస్ట్రిబ్యూటర్ ఫార్స్ ఫిల్మ్స్ టాక్సిక్ స్టోరీ లైన్ రివీల్ చేసినట్లు తెలుస్తోంది. '1940 - 70 మధ్య గోవా బ్యాక్ డ్రాప్‌గా సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. అందమైన సముద్ర తీరం వెనుక దాగి ఉన్న చీకటి సామ్రాజ్యం, రక్తపాతం, నేర సిండికేట్లు, వెన్నుపోట్ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇంతటి నేర సామ్రాజ్యంలో ఓ సామాన్యుడు భయం, ద్రోహంతో తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడో అనేదే కథ.
అండర్ వరల్డ్ సామ్రాజ్య అధికారం కోసం యశ్ తనను తాను ఎలా మార్చుకున్నాడు? ఏదైనా పని పూర్తి చేయడానికి అతను తనపై తప్ప వేరే ఎవరిపై ఆధారపడని మనస్తత్వం. స్మగ్లింగ్ మార్గాలు యుద్ధ భూములుగా మారినప్పుడు... వినయ విధేయతలు అనుమానంగా వెన్నుపోటుగా మారినప్పుడు మానసిక రుగ్మత అతనిలో మార్పునకు కారణం అవుతుంది. అన్నీ దెబ్బలు ఎదుర్కొని పవర్ ఫుల్ సామ్రాజ్యాన్ని అతను నిర్మించుకున్నాడు.' ఇదే స్టోరీ లైన్ అని సమాచారం.
Also Read : రాజమౌళి 'వారణాసి'లో కన్నడ స్టార్? - ఈగ, బాహబలి తర్వాత విజువల్ వండర్‌లో...
ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా... యశ్ 'రాయ'గా కనిపించనున్నారు. ఇక నదియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజిబెత్ రాణిని పోలి ఉండే పాత్రలో హుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మార్చి 19న రిలీజ్ కానుంది.
తెలుగులో బిగ్ డీల్
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ రైట్స్ కోసం బిగ్ డీల్ కుదిరింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.120 కోట్లకు టాక్సిక్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆయనకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మూవీని ఏపీ, తెలంగాణల్లో రిలీజ్ చేయనున్నారు.
























