కన్నడ కథానాయకుడు - రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) 'కేజీఎఫ్'తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా సినిమా 'టాక్సిక్' నుంచి ఈ మధ్య హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు యష్. ఆ సినిమాలతో వార్తల్లో నిలుస్తారు. కానీ ఈసారి ఆయన తన తల్లి కారణంగా వార్తల్లో నిలిచారు. యష్ తల్లి పుష్ప (Yash Mother Pushpa) ల్యాండ్ కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే, కోర్టు ఆదేశాల తర్వాత ఫిర్యాదుదారు దేవరాజు ఆమె ఆధీనంలో ఉన్న ఆస్తిని ఖాళీ చేయించారు. దేవరాజు తన భూమిని తిరిగి పొందడానికి చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
అసలు వివరాల్లోకి వెళితే... యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ (Pushpa Arun Kumar)పై హసన్ లోని విద్యానగర్ లో ఉన్న ఇంటిలో 1500 చదరపు అడుగుల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు జీపీఏ హోల్డర్ అయిన దేవరాజు. పుష్ప అక్కడ ఒక పెద్ద నిర్మాణం చేపట్టారు. అయితే ఆ భూమికి యజమాని దేవరాజే అని ఆయన పేర్కొంటున్నారు. త్వరలో నిజానిజాలు రానున్నాయి.
Also Read: పరాశక్తి బ్యానర్లు చింపేసిన దళపతి విజయ్ ఫ్యాన్స్... తమిళనాడులో సంక్రాంతి రిలీజులు రగడ
సినిమా నిర్మాణంలో మోసపోయిన యష్ తల్లి
యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ గురించి ఇలాంటి చర్చ జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో 'KGF' స్టార్ యష్ తల్లి 65 లక్షల రూపాయల మోసానికి గురయ్యారు. సినిమా ప్రమోటర్ హరీష్ అరాసుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ సినిమా 'కొత్తలవాడి' ప్రమోషన్ బాధ్యతలను హరీష్ అరాసుకు అప్పగించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా ప్రమోషన్ కోసం 2.3 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, హరీష్ సినిమా పేరుతో వివిధ మార్గాల ద్వారా 24 లక్షలు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. ప్రింట్ మీడియా ప్రకటనల కోసం పుష్ప అరుణ్ కుమార్ 65 లక్షల రూపాయలు ఇచ్చారని, అయితే సినిమా సరిగ్గా ప్రమోట్ కాలేదని ఫిర్యాదులో తెలిపారు. డబ్బుల విషయంలో లెక్కలు అడిగినప్పుడు పుష్పతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా... సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ చేస్తానని హరీష్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
యష్ తల్లి సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దాని పేరు PA ప్రొడక్షన్స్ హౌస్. ఆ బ్యానర్‌పై కన్నడ సినిమా 'కొత్తలవాడి' ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా గత ఏడాది ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం యష్ టాక్సిక్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆ సినిమా థియేటర్లలోకి రానుంది.
Also Read: ఎవరీ దీప్శిఖా చంద్రన్? కన్నడ 'మార్క్'తో సెన్సేషన్... నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ