Top 10 Malayalam Movies in 2024 : మలయాళం సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. కొన్ని ఫుల్ మీల్స్​లా మంచి తృప్తినిస్తే మరికొన్ని ఎందుకు చూశామురా అనే ఫీల్​ని ఇస్తే. భాషతో సంబంధం లేకుండా.. తెలుగు డబ్ వెర్షన్ విడుదలకాకున్నా కూడా మలయాళం సినిమాలు చూసే టాలీవుడ్ ప్రేక్షకులు ఉన్నారు. 2024లో మలయాళం హిట్​ అయిన టాప్ 10 సినిమాలు ఏంటి? అవి ఏ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయో ఇప్పుడు చూసేద్దాం. 


ఆవేశం (Avesham)


ఇల్లుమీనాట్టి.. అంటూ వచ్చేశాడు ఫాహాద్ ఫాజిల్. ఇంజినీరింగ్ విద్యార్థులపై లోకల్ గ్యాంగ్​స్టర్ ప్రభావం ఎలా ఉంటుందనేది చాలా ఫన్నీ వేలో చూపించారు. ఈ సినిమాలో ఫాహాద్ యాక్టింగ్​తో పాటు.. స్టూడెంట్స్​గా చేసిన వారి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ఆవేశం సినిమా  అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమ్ అవుతుంది. 


మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys)


సుభాషు.... మంజుమ్మెల్ బాయ్స్ సినిమా చూసిన తర్వాత పిల్లలు సైతం ఈ పేరును జపించేశారు. గుణ కేవ్స్ కూడా ఈ మూవీతో బాగా ఫేమస్ అయిపోయింది. సర్వైవల్ థ్రిల్లర్​గా రియల్​ స్టోరిని తెరపైకి ఎక్కించారు డైరక్టర్ చిదంబరం. థియేటర్​లోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమా హిట్​ టాక్​ని దక్కించుకుంది. ఈ సినిమా హాట్​స్టార్​లో స్ట్రీమ్ అవుతుంది. 


ARM ( Ajayante Randam Moshanam)


టోవినో థామస్ కథలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ARM సినిమాలో అతను మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు. పైగా ఈ సినిమాతో కృతి శెట్టి మలయాళంలో తన డెబ్యూ ఇచ్చింది. ఈ సినిమాకు, పాటలకు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. రూ.100కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్​ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్​స్టార్​లో స్ట్రీమ్ అవుతుంది. 


గోలం (Golam)


క్రైమ్ థ్రిల్లర్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది గోలం సినిమా. ఓ ఆఫీస్​లో బాస్​ మర్డర్ జరుగుతుంది. దానిని ఇన్విస్టిగేషన్​ చేసేందుకు పోలీసులు వస్తారు. తర్వాత ఏమి జరిగింది? నిందుతులు ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్​గా సాగుతుంది. అయితే ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్​ ఇచ్చి.. పార్ట్​ 2 గురించి ఎదురు చూసేలా చేశాడు. డైరక్టర్ సంజాద్. థ్రిల్లర్ స్టోరీలు ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్​లో ఈ సినిమాను చూడొచ్చు. 


ప్రేమలు (Premalu)


దర్శకధీరుడు రాజామౌళి ఇచ్చిన హైప్​తో.. తెలుగు మీమ్స్​తో.. సరదా తెలుగులోకి వచ్చి.. భారీ హిట్ అందుకున్న మలయాళం సినిమా ప్రేమలు. ఈ సినిమాలోని దాదాపు ప్రతి డైలాగ్​ తెలుగులోని మీమ్స్​కి కనెక్ట్ అవుతుంది. పైగా ఈ చిత్రాన్ని హైదరాబాద్​లోనే తెరకెక్కించడం వల్ల ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 


తలవాన్ (Thalavan) 


బిజు మీనన్ ప్రధాన పాత్రలో మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన చిత్రం తలవాన్. యదార్థ ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇద్దరు పోలీసుల మధ్య ఈగో ఉండి.. వారిలో ఒకరు మర్డర్ కేస్​లో ఇరుక్కుంటే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్​గా చూపించారు. ఈ సినిమా సోని లివ్​లో స్ట్రీమ్ అవుతుంది.


ఉల్లోజుక్కు (Ullozhukku)


థియేటర్​లో పెద్దగా హిట్​ కాకపోయినా.. ఓటీటీలో మంచి హిట్​ టాక్​ని సంపాదించుకున్న చిత్ర ఉల్లోజుక్కు. ఓ సెన్సిటివ్ లైన్​ని తీసుకుని.. దానిలో ఎమోషన్స్​ని మిక్స్ చేసి.. లీడ్స్​గా ఇద్దరు ఫిమేల్ లీడ్స్​ని తీసుకుని.. ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు క్రిస్టో టామి. భర్తతో ఉండలేక, ప్రేమించిన వాడితో బతకలేక.. హీరోయిన్​ ఉండగా.. కథలో భర్త క్యారెక్టర్​ని అనారోగ్యంతో చంపేశాడు డైరక్టర్​. ఆ తర్వాత సినిమా ఎలా సాగిందనేదే ఇంట్రెస్టింగ్​గా తీశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమ్ అవుతుంది. 


వాజా (Vaazha)


దాదాపు టీనేజ్​లో ఉండే ప్రతి కుర్రాడు వాజా సినిమాకు కనెక్ట్ అవుతాడు. నలుగురు ఫ్రెండ్స్. అల్లరి చిల్లరిగా ఉంటారు. టీనేజ్​లో ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. వారు సక్సెస్​ అవ్వడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందనేది ఈ సినిమాలో చూపించారు. హాట్​స్టార్​లో ఈ సినిమాను చూడొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో చూడదగ్గ సినిమాల్లో ఇది ఒకటి. 


సూక్ష్మదర్శిని (Sookshmadarshini)


మిస్టరీ థ్రిల్లర్​గా తెరకెక్కిన చిత్రం సూక్ష్మదర్శిని. నజ్రియా నజీమ్, బాసిల్ జోసేఫ్​ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్​లో మంచి హిట్​ టాక్​ను అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీకి ఇంకా రాలేదు కానీ.. త్వరలో జీ5లో స్ట్రీమ్ కానుంది. 



మార్కో (Marco)


యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు మార్కో సినిమాను హాయిగా చూడొచ్చు. వయెలెన్స్​తో ఈ సినిమా థియేటర్లలో మంచి లాభాలను అందుకుంటుంది. భాగమతి సినిమా ఫేమ్ ఉన్నిముకుందన్ ఈ సినిమాలో తన యాక్షన్​తో ప్రేక్షకులకు మంచి ఫీస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. కాబట్టి యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు తెరపై ఈ సినిమాను చూడొచ్చు. 


Also Read : బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?