ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు...
తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!


తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రాముడు అయినా, కృష్ణుడు అయినా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావే (Nandamuri Taraka Rama Rao). తెలుగు తెరపై ప్రేక్షకులు చూసిన భగవత్ స్వరూపం ఆయన. కథానాయకుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణిక, జానపద సినిమాలు చేశారు. సాంఘీక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అయితే, తన తర్వాత తరం రాకతో ఒకానొక దశలో ఎన్టీఆర్ పనైపోయిందని కామెంట్లు సైతం కొందరి నోటి వెంట వచ్చాయి. విమర్శలకు విజయాలతో ఎన్టీఆర్ బదులు ఇచ్చారు. ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్స్ కింద నిలిచిన ఐదు కమర్షియల్ సినిమాలు... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)



నిఖిల్‌తో రామ్ చరణ్ సినిమా - ఇక విప్లవం మొదలు


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఆదివారం ఉదయం రానుంది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది! అది ఏమిటంటే... ఆ సినిమాలో ఆయన హీరో కాదు. నిర్మాణ భాగస్వామి మాత్రమే! తన మిత్రుడు, యువి క్రియేషన్స్ సంస్థలో కీలక భాగస్వామి విక్రమ్ రెడ్డితో కలిసి 'వి మెగా పిక్చర్స్' సంస్థను స్టార్ట్ చేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా చిత్రాలు నిర్మిస్తామని రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి తెలిపారు. వాళ్ళ సంస్థలో సినిమా ప్రకటనే రేపు రానుంది. వి మెగా పిక్చర్స్ సంస్థ నిర్మించే తొలి సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనతో 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ ఫిల్మ్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)



శత జయంతి ఒక్కసారే వస్తుందని, పుట్టిన రోజులు మళ్ళీ వస్తాయని రిక్వెస్ట్ చేసినా రాలేదు - టీడీ జనార్థన్


విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. తెలుగు చిత్రసీమలో ప్రముఖులు చాలా మంది హాజరు అయ్యారు. వెంకటేష్, రామ్ చరణ్, సుమంత్, అక్కినేని నాగ చైతన్య తదితరులు ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడారు. అయితే, ఆ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లేకపోవడం (రాకపోవడం) మీద చర్చ జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత, యంగ్ టైగర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన వ్యక్తుల్లో ఒకరైన టీడీ జనార్థన్ స్పందించారు. 
(పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 'ఇంద్ర' సెంటిమెంట్!?


మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి విజయవాడతో మంచి అనుబంధం ఉంది. ఆ నగరంలో ఆయనకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. చిరు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'ఇంద్ర' విజయోత్సవ సభ (175 రోజుల వేడుక) ప్రస్తుతం ఏపీలో ఉన్న విజయవాడలో జరిగింది. మరో సినిమా వేడుకను ఆ నగరంలో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్'. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంత కంటే ముందు అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో ఆ ఈవెంట్ చేయాలని నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి - బండ్ల గణేష్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో తాను ఒకడినని పలు సినిమా వేదికలపై సగర్వంగా ప్రకటించుకున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh). తనకు పవన్ దేవుడితో సమానమని సైతం పేర్కొన్నారు.  తన పిల్లలు దేవుడు ఎలా ఉంటాడు? నిజాయతీ అంటే ఏమిటి? అని అడిగితే పవన్ కళ్యాణ్ ఫోటోలు చూపించానని చెప్పుకొచ్చారు. అటువంటి బండ్ల గణేష్, ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)పై విమర్శలు చేస్తున్నారు. బండ్ల గణేష్ శనివారం ఉదయం చేసిన ట్వీట్ చూస్తే... తాను దేవుడిగా కొలిచే పవన్ కళ్యాణ్‌కు, తనకు మధ్య దూరం పెరగడానికి కారణం త్రివిక్రమ్ అని పరోక్షంగా చెప్పాలని ట్రై చేస్తున్నట్లు అర్థం అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)