The Great Pre Wedding Show Movie Trailer : డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్... సరికొత్తగా వెడ్డింగ్ షూట్ - 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్' మూవీ హైలెట్స్ ఏంటో తెలుసా?
The Great Pre Wedding Show Release Date : 'మసూద' ఫేం తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ట్రైలర్ వచ్చేసింది. నవంబర్ 7న మూవీ రిలీజ్ కానుంది.

The Great Pre Wedding Show Trailer Launch Event Highlights : వెర్సటైల్ యాక్టర్, 'మసూద' ఫేం తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. గ్రామీణ నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కగా... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా మూవీ టీం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా... పప్పెట్ షో ప్రొడక్షన్ బ్యానర్‌పై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మిస్తున్నారు.
నవంబర్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు షేర్ చేసుకున్నారు.
తల్లి చనిపోయినా కూడా...
తాను తిరువీర్‌ను ఓ నాటకంలో చూశానని... అప్పుడే మూవీ తీస్తే తిరువీర్‌కు ఓ పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు డైరెక్టర్ కరుణ కుమార్ తెలిపారు. ''పలాస'లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నా. ఆ మూవీ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.' అని అన్నారు.
అన్నీ రకాల ఎమోషన్స్‌ను తిరువీర్ అద్భుతంగా పలికిస్తారని... తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారని డైరెక్టర్ సన్నీ తెలిపారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ మూవీతో తిరువీర్ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. తిరువీర్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారని... ఆయనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నట్లు డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెలిపారు. మూవీ 100 శాతం బిగ్ సక్సెస్ అందుకుంటుందని... డైరెక్టర్స్ దుష్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ అన్నారు.
Also Read : అడివి శేష్ 'డెకాయిట్' రిలీజ్ డేట్ - ఈసారి వెనక్కి తగ్గేదేలే...
'ఎంతో సపోర్ట్ చేశారు'
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ట్రైలర్ ఈవెంట్‌కు ఇంతమంది దర్శకులు రావడం ఎంతో ఆనందంగా ఉందని హీరో తిరువీర్ అన్నారు. 'నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా మూవీ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నా. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్.' అని చెప్పారు. ఇంతమంది డైరెక్టర్స్ తమ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందని హీరోయిన్ టీనా శ్రావ్య తెలిపారు. ఆడియన్స్ అందరినీ నవ్వించేలా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ ఉంటుందని మాస్టర్ రోహన్ తెలిపారు.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' యాక్టర్స్ - తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ తదితరులు
టెక్నికల్ టీం - రచయిత & దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్, నిర్మాతలు : సందీప్ అగరం & అశ్మితా రెడ్డి బసాని, సహ నిర్మాత : కల్పనారావు, సంగీతం : సురేష్ బొబ్బిలి, DOP : K సోమశేఖర్, ఎడిటర్ : నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రజ్ఞయ్ కొణిగారి, ప్రొడక్షన్ డిజైనర్ : ఫణి తేజ మూసి, కాస్ట్యూమ్ డిజైనర్లు : ఆర్తి విన్నకోట, ప్రియాంక వీరబోయిన, సాహిత్యం : సనారే, సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్.





















