Thiruveer's The Great Pre Wedding Show Teaser Out: 'మసూద', 'జార్జ్ రెడ్డి' వంటి మూవీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న హీరో తిరువీర్ లేటెస్ట్ కామెడీ డ్రామా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా... 'కమిటీ కుర్రాళ్లు' హీరోయిన్ టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించారు. తాజాగా మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
శేఖర్ కమ్ముల చేతుల మీదుగా...
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో మంగళవారం సాయంత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ముఖ్య అతిథిగా ఫేమస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే ట్రైలర్‌ను లాంచ్ చేశారు. తిరువీర్, టీనా శ్రావ్యతో పాటు రోహన్ రాయ్, నరేంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. 7 పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై అష్మితా రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.
కామెడీ ఫోటో షూట్
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' టీజర్ స్టార్టింగ్ నుంటి లాస్ట్ వరకూ ఆద్యంతం నవ్వులు పూయించింది. గ్రామంలో ఉండే ఒకే ఒక్క ఫోటోగ్రఫీ స్టూడియో రమేష్ ఫోటోగ్రఫీ స్టూడియో. మండలం మొత్తంలో బర్త్ డే, వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ అన్నింటికీ అక్కడికే వస్తుంటారు. కొత్తగా పెళ్లయ్యే కపుల్‌కు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం, గ్రామాల్లో చాదస్తపు మనుషులతో వచ్చే ఇబ్బందులు, హీరో లవ్ స్టోరీ అన్నింటినీ కలగలిపి ఫుల్ కామెడీ ట్రీట్ అందేలా చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
Also Read: ఎవరీ మహికా శర్మ? - క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఫేమస్ మోడల్... ఈ విషయాలు తెలుసా!