The Girlfriend Trailer: రష్మిక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్... 'ది గర్ల్ ఫ్రెండ్' అప్డేట్ ఏమిటంటే?
Rashmika Girlfriend Trailer Release Date: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అంత కంటే ముందు ట్రైలర్ రానుంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'థామా' ఇటీవల విడుదలైంది. తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. ఆ మూవీకి హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగులో అంత సూపర్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఆ సినిమా పక్కనపెట్టి కొత్త సినిమా మీద రష్మిక దృష్టి పెట్టింది. 'ది గర్ల్ ఫ్రెండ్'తో థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యింది.
అక్టోబర్ 25న 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్!
The Girlfriend Trailer Release Date: రష్మికకు జంటగా టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి 'ది గర్ల్ ఫ్రెండ్'లో నటించారు. నాని 'దసరా'లో ఆయన కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలపై సంయుక్తంగా రూపొందుతున్న చిత్రమిది. కథానాయకుడు - దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ అద్భుతమైన కథతో రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు.
Also Read: 'సలార్' రీ రిలీజ్ రివ్యూ... ఫ్యాన్స్ అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయ్, వాళ్ళకు పూనకాలే!
The Girlfriend Movie Release Date: అక్టోబర్ 25న... అంటే శనివారం సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 7వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
View this post on Instagram
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహాబ్, కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైనర్లు: ఎస్ రామకృష్ణ - మౌనిక నిగోత్రి, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని - విద్య కొప్పినీడి, రచన - దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.
Also Read: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ థియేటర్లు ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!





















