(Source: ECI | ABP NEWS)
Akhanda 2 Update : బాలయ్య రుద్ర తాండవం... డివోషనల్ బీజీఎం వేరే లెవల్ - తమన్ ఆన్ డ్యూటీ
Thaman: 'అఖండ 2' కోసం మ్యూజిక్ లెజెండ్ తమన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫేమస్ క్లాసికల్ సింగర్స్ ఇందులో భాగం కాగా... సాంస్కృతిక, పురాణ సాహిత్యం వేరే లెవల్‌లో ఉండబోతుందని అర్థమవుతోంది.

Thaman BGM Work For Balakrishna AKhanda 2 Movie : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతోన్న 'అఖండ 2' కోసం బాలయ్య అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ సౌండ్‌కు రీసౌండ్ గ్యారంటీ అనేలా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ వేరే లెవల్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
పవర్ ఫుల్ బీజీఎం
బాలయ్య గ్రేస్, జోష్‌కు తగ్గట్లుగానే బీజీఎం అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మాస్ యాక్షన్ అంశాలకు డివోషనల్ టచ్‌తో మూవీ రూపొందుతుండగా అందుకు అనుగుణంగా వేదాలు, శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక భావన అందేలా మ్యూజిక్ రూపొందిస్తున్నారు. బాలయ్య 'అఖండ' రుద్ర తాండవాన్ని తమన్ బీజీఎం స్పెషల్‌గా మారుస్తుందని మూవీ టీం చెబుతోంది. తాజాగా మ్యూజిక్ అప్డేట్ షేర్ చేసుకున్నారు తమన్. 'సర్వేపల్లి సిస్టర్స్ 'అఖండ 2'కు తమ దివ్య స్వరాలు అందించారు.' అంటూ రాసుకొచ్చారు. 
మూవీలో మ్యాగ్జిమమ్ పార్ట్ డివోషనల్ టచ్ ఉండగా... ఆధ్యాత్మికత, దైవత్వాన్ని బీజీఎంతో పాటు పాటల రూపంలో ఎక్కువ భాగం ఉండేలా తమన్ ప్లాన్ చేస్తున్నారు. ఫేమస్ క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్‌తో వర్క్ చేస్తున్నట్లు రివీల్ చేయగా... సాంస్కృతిక, పురాణ సాహిత్యం ఇక వేరే లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. రీసెంట్‌గానే సంస్కృత శ్లోకాలు చెప్పడంలో ఫేమస్ అయిన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులను కూడా రంగంలోకి దింపారు. వీరు చెప్పిన శ్లోకాలు సోషల్ మీడియాలో గూస్ బంప్స్ తెప్పించాయి. తాజాగా క్లాసికల్ సింగర్స్‌ను సైతం భాగం చేయడంతో థియేటర్స్‌లో బీజీఎం దద్దరిల్లడం ఖాయమేనంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read : హిందీ 'జేజెమ్మ'గా యంగ్ బ్యూటీ? - టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ సమర్పణలో...
'అఖండ 2'లో బాలయ్య డ్యూయెల్ రోల్ చేయబోతున్నారు. ఒకటి అఘోర పాత్ర కాగా... మరొకటి మురళీ కృష్ణ పాత్ర. బ్లాస్టింగ్ రోర్ పేరుతో అఘోర పాత్ర కోసం అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించగా... లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన టీజర్ రీసౌండ్ అదిరిపోయింది. ఒకదాన్ని మించి మరొకటి అనేలా లుక్స్, బీజీఎం ఉన్నాయి. బాలయ్య మాస్ డైలాగ్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషించారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట్ మూవీని నిర్మించారు. 2021లో వచ్చిన 'అఖండ'కు సీక్వెల్‌గా మూవీ తెరకెక్కుతుండగా... తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఈ మూవీ కూడా బిగ్ సక్సెస్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















