Thalapathy Vijay's Tenth Class Marks List : తమిళ రాజకీయాల్లో కోలీవుడ్ స్టార్ విజయ్ ఓ సంచలనం. రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించి ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్‌గా పోటీలో నిలిచి 108 స్థానాల్లో అఖండ విజయం సాధించారు. ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేస్తూ తమిళ ప్రజల మనసులు గెలుచుకున్నారు. అయితే, సీఎం పీఠం అధిరోహించాలంటే ఇంకా 10 సీట్ల మెజార్టీ కావాలి. ఇందు కోసం దళపతి పావులు కదుపుతున్నారు.
గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు, ఇతర స్టార్స్... విజయ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిణామాలతో అటు ఇండస్ట్రీ ఇటు సోషల్ మీడియాలో విజయ్ పేరు మార్మోగుతోంది. తాజాగా ఆయన టెన్త్ మార్క్స్ లిస్ట్ ట్రెండ్ అవుతోంది.
ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులంటే?
విజయ్ తన 10వ తరగతి పరీక్షల్లో 65 శాతం మార్కులు సాధించారు. మొత్తం 1100 మార్కులకు గానూ 711 మార్కులు సాధించారు. తన మాతృ భాష తమిళంలో 200కి 155 మార్కులు తెచ్చుకుని టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తర్వాత సైన్స్‌లో 300కి 206, ఇంగ్లీష్‌లో 200కి 133, సోషల్‌లో 200కి 122, మ్యాథ్స్‌లో 200కి 95 మార్కులు సాధించారు. అన్నింటి కంటే తక్కువ మార్క్స్ మ్యాథ్స్‌లోనే వచ్చాయి.
చెన్నైలో స్కూల్ ఎడ్యుకేషన్
విజయ్ తన స్కూల్ ఎడ్యుకేషన్‌ను చెన్నైలోనే ప్రారంభించారు కోడంబాక్కంలోని ఫాతిమా పాఠశాలలో చదివి, ఆ తర్వాత విరుగంబాక్కంలోని బాలలోక్ స్కూల్‌కు మారారు. ఆ తర్వాత టెన్త్ పరీక్షలు రాసి... స్కూల్ విద్య పూర్తయ్యాక చెన్నైలో లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివేందుకు చేరారు. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మధ్యలోనే ఆపేసి సినిమాల వైపు అడుగులేశారు. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి డిగ్రీ ఆపేసిన అదే లయోలా కాలేజీలోనే ఎమ్మెల్యేగా గెలుపు పత్రం అందుకున్నారు.
Also Read : సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు? - తమిళనాడు పొలిటికల్ పరిస్థితిపై ప్రకాష్ రాజ్, కమల్, విశాల్ రియాక్షన్
Also Read : రామ్ చరణ్ పెద్ది ఎడిట్ కంప్లీట్ - భారీ స్థాయిలో ప్రీమియర్స్... మెగా మాసివ్ ట్రీట్ కన్ఫర్మ్
సీఎంగా విజయ్ ప్రమాణం ఎప్పుడు?
తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు హాట్ టాపిక్‌గా మారాయి. ఓవైపు విజయ్‌కు ఇతర స్టార్స్ సపోర్ట్ పెరుగుతుండడంతో పాటు గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సపోర్ట్ ఇచ్చే 118 మంది ఎమ్మెల్యే లిస్ట్‌తోనే రావాలని గవర్నర్ విజయ్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించగా... కాంగ్రెస్ సపోర్ట్‌తో బలం 112కు చేరింది. ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన త్వరగా మద్దతు సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని తమిళ ప్రజలతో పాటు అభిమానులు కోరుతున్నారు.
