Jana Nayagan Release Date : 'జన నాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్! - వెనక్కి తగ్గిన మేకర్స్... వారం రోజుల్లోనే...
Jana Nayagan : విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సెన్సార్ వివాదాలు క్లియర్ చేసేలా చిత్ర నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

Thalapathy Vijay's Jana Nayagan Release Date To Expect Soon : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్, సెన్సార్ బోర్డ్ మధ్య వివాదాలతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా, నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గినట్లు సమాచారం.
కేసు విత్ డ్రా
సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత మూవీని రివైజింగ్ కమిటీకి పంపాలన్న సెన్సార్ బోర్డు నిర్ణయంపై చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలీజ్ వాయిదా పడగా... ఆ కేసు విత్ డ్రా చేసుకుని సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో వివాదం సమసిపోయి, సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వారం రోజుల్లో జారీ అవుతుందని భావిస్తున్నారు. సెన్సార్ ఆమోదం పొందిన తర్వాత ఈ నెలలోనే మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read : పవన్ సినిమాలో 'ఫౌజీ' హీరోయిన్? - రెబల్ స్టార్ తర్వాత పవర్ స్టార్‌తో...
కన్ఫ్యూజన్ To క్లారిటీ
- 'జన నాయగన్' మూవీకి ముందు U/A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు ఆ తర్వాత మూవీని రివైజింగ్ కమిటీకి పంపాలని సూచించింది. దీనిపై మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. విచారించిన సింగిల్ బెంచ్ సెన్సార్ నిర్ణయంపై స్టే విధిస్తూ U/A సర్టిఫికెటే జారీ చేయాలని ఆదేశించింది.
- సింగిల్ బెంచ్ డెసిషన్‌పై సెన్సార్ బోర్డు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించగా... సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ సర్టిఫికెట్ జారీ తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని స స్పష్టం చేసింది.
- ఈ క్రమంలో విచారణ సందర్భంగా రివైజ్ కమిటీ చూసిన తర్వాత సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంత వరకూ ఆగాల్సిందేనని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది.
- ఇది మరింత ఆలస్యం అవుతున్న క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ వెనక్కు తగ్గి మూవీని రివైజింగ్ కమిటీకి పంపింది. దీని తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.
దళపతి విజయ్ చివరి సినిమా కావడంతో 'జన నాయగన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. 'ప్రేమలు' మమితా బైజు కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే బాబీ డియోల్, నరైన్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.
























